Robbing banks: బ్యాంకులను దోచుకుంటున్న దొంగలు?

Robbing banks: దేశంలో బ్యాంకులను లూటీ చేస్తున్న బడా బాబుల సంఖ్య పెరుగుతోంది. రూ. వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటూ బ్యాంకులకు టోకరా వేస్తున్నారు. దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోంది. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సుబ్బిరామిరెడ్డి రాష్ర్ట హైకోర్టును ఆశ్రయించి బ్యాంకులకు డబ్బు ఎగవేసిన బడాబాబులకు వ్యతిరేకంగా ఓ తీర్పు తీసుకొచ్చారు. దీంతో బ్యాంకులను ముంచిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా రూల్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో […]

Written By: Neelambaram, Updated On : December 8, 2021 8:35 pm
Follow us on

Robbing banks: దేశంలో బ్యాంకులను లూటీ చేస్తున్న బడా బాబుల సంఖ్య పెరుగుతోంది. రూ. వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటూ బ్యాంకులకు టోకరా వేస్తున్నారు. దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోంది. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సుబ్బిరామిరెడ్డి రాష్ర్ట హైకోర్టును ఆశ్రయించి బ్యాంకులకు డబ్బు ఎగవేసిన బడాబాబులకు వ్యతిరేకంగా ఓ తీర్పు తీసుకొచ్చారు. దీంతో బ్యాంకులను ముంచిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా రూల్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

Robbing Banks

గతంలో బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదనే విధంగా తెచ్చిన చట్టాన్ని మార్చి మరో తీర్పు రావడంలో కీలక పాత్ర పోషించిన సుబ్బిరామిరెడ్డి పాత్ర అనిర్వచనీయం. దీంతో బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే వీలు కలుగుతోంది. సంపద కొద్ది మంది చేతుల్లోనే మూలుగుతోంది. దీంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం గమనార్హం.

బ్యాంకులకు డబ్బు ఎగవేసిన బడాబాబుల్లో బీజేపీ నేత సుజనా చౌదరి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వంటి వారు ఉన్నారు. రూ. వేల కోట్లు రుణంగా తీసుకుని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు. అయినా వారిపై ఈగ కూడా వాలడం లేదు. ఈ నేపథ్యంలో పేదవారు పేదవారుగానే ధనికులు ధనవంతులుగానే ఎదుగుతున్నారు. కేవలం పది శాతం మంది చేతుల్లోనే సంపద ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Helicopter Crash: ఇప్పటి వరకు హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీళ్లే..

దీంతో దేశం ఎటు వైపు పోతోంది. రాజకీయ నాయకుల స్వార్థం కోసం ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ బ్యాంకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. సామాన్యులకైతే కర్రీలు పెట్టే బ్యాంకు అదికారులు రాజకీయ నాయకులకు ఎందుకు ఇంత మొత్తంలో రుణం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే సామాన్యుడికైతేనేమ సవాలక్ష నిబంధనలు అదే నాయకుడికైతే ఏవీ పాటించడం లేదని తెలుస్తోంది. దీనికి ఏం సమాధానం చెబుతారు. ఎవరు బాధ్యత వహిస్తారు? వేల కోట్లు ఎక్కడి నుంచి కడతారు? ఎలా బ్యాంకుల రుణం తీరుస్తారు? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

దేశంలో బడాబాబుల బాగోతాలపై చోద్యం చూస్తున్న అధికారులు ఎంత మేరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వేల కోట్లు ఎలా తిరిగి రాబడతారు. ప్రజలకు చేరాల్సిన సొమ్మును ఏ ఒక్కరికో అందజేయడం ఏమిటి? వారి నుంచి అమ్యామ్యాలు స్వీకరిస్తూ వారిని అందలాలు ఎక్కించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న అధికారులపై ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Also Read: Bipin Rawat: హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత

Tags