https://oktelugu.com/

Tollywood: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, అనన్య కొత్త చిత్రం ప్రారంభం…

Tollywood: బిగ్‌బాస్‌ నాలుగవ సీజన్‌లో పాల్గొని తనదైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాధించుకున్నాడు సోహెల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’. శ్రీ కోనేటి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మొద‌టి స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 07:26 PM IST
    Follow us on

    Tollywood: బిగ్‌బాస్‌ నాలుగవ సీజన్‌లో పాల్గొని తనదైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాధించుకున్నాడు సోహెల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’. శ్రీ కోనేటి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మొద‌టి స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. కాగా అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

    ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ ”బిగ్‌బాస్ హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చేస్తున్న రెండో చిత్ర‌మిది. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. బూట్ క‌ట్ బాల‌రాజు అనే క్యారెక్ట‌ర్ డెఫినెట్‌గా మీ అంద‌రిలో ఉండిపోతుంది. అన్ని వ‌ర్గాల వారు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు. అన‌న్య నాగ‌ళ్ల మాట్లాడుతూ – ” ‘మ‌ల్లేశం’ సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్ట‌ర్స్ రావ‌డం మొద‌లైంది. ఈ సినిమాలో కొంచెం బ‌బ్లీగా ఉండే క్యారెక్ట‌ర్. నాకు చాలా ఇష్ట‌మైన పాత్ర‌. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. ల‌క్కీ మీడియాలో సోహెల్‌తో క‌లిసి చేయ‌డం చాలా హ్యాపీ” అని తెలిపింది. మరోవైపు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే చిత్రంలో కూడా సోహెల్ నటిస్తున్నాడు. శ్రీనివాస్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది.