
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, రతుపవనాల ఆగమనం వంటి సానుకూల పరిణామలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9.25 గంటల సమయంలో సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 52,527 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 15,813 వద్ద కొనసాగతుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ. 72,94 వద్ద ట్రేడవుతోంది.