AP Political Critic Survey : అటు జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఏపీలో మరోసారి జగన్ గెలుస్తాడని చెబుతున్నాయి. టైమ్స్ నౌ నుంచి మొదలుపెడితే జాతీయ పలు సర్వే సంస్థలు జగన్ కు మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని.. వచ్చేసారి జగన్ దే గెలుపు అంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జగన్ కు అంత అనుకూల వాతావరణం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే..
ఇక కొన్ని లోకల్ సంస్థలు మాత్రం వచ్చేసారి ఏపీలో టీడీపీ గెలుస్తాయని చెబుతున్నాయి.. కొన్ని జాతీయ సంస్థలు సైతం టీడీపీ, జనసేన కలిస్తే ఆ రెండు పార్టీలదే ఏపీ అంటున్నాయి. ఇటీవల జన్మత్ పోల్స్ అనే సర్వే ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వచ్చే ఎన్నికల్లో 116 నుంచి 118 స్థానాల్లో వైసిపి గెలవనుందని ప్రకటించింది. తెలుగుదేశం కూటమి 46 నుంచి 48 స్థానాలకే పడిపోనుందని స్పష్టం చేసింది.ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలపై ఈ సంస్థ చేసిన సర్వేలో చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 63 సీట్లలోపు వస్తాయని అంచనావేయగా నిజమైంది. బీఆర్ఎస్ కు 45 లోపు వస్తాయని తెలుపగా 39కి పరిమితమైంది. అందుకే ఏపీలో ఆ సంస్థ ఫలితాలు వైసీపీకి నమ్మకం కలిగించాయి.
కానీ టీడీపీ అనుకూల వాదులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఏపీలో జగన్ పై వ్యతిరేకత ఉందని ఆయన ఓడిపోవడం ఖాయమని ఘంఠాపదంగా చెబుతున్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలోనూ జగన్ పై వ్యతిరేకత ఉందని.. అందుకే అభ్యర్థులను మార్చుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని సర్వేల్లో వైసీపీ లీడ్ సాధిస్తుండగా.. మరికొన్నింటిలో టీడీపీ జనసేనదే విజయం అనడంతో అంతటా కన్ఫ్యూజన్ నెలకొంది.
ఇప్పుడు మరో సర్వే సంస్థ ప్రీపోల్ నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్లపై నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు చూస్తే..
Andhrapradesh assembly seats survey results.
If the elections are held right now.
YSRCP: 115+/-5
TDP+JSP: 60+/-5
BJP: 00
Congress: 00Expected vote share for assembly elections
YSRCP: 48%
TDP+JSP: 44%
BJP: 1.5%
CONGRESS: 1.5%
OTHERS: 5% #AndhraPradeshElection2024 pic.twitter.com/2P9fMMmCbd— Political Critic (@PCSurveysIndia) January 22, 2024
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
వైసీపీకి : 115 (ఐదు సీట్లు అటూ ఇటూ)
టీడీపీ+జనసేన : 60 (ఐదు సీట్లు అటూ ఇటూ)
బీజేపీ : 0
కాంగ్రెస్ : 0
-ఇక ఏ పార్టీకి ఎంత ఓటు శాతం అంటే..
వైసీపీకి : 48 శాతం
టీడీపీ+జనసేన : 44 శాతం
బీజేపీ : 1.5 శాతం
కాంగ్రెస్ : 1.5 శాతం
ఇతరులు : 5 శాతం
——————
ఇక లోక్ సభ సీట్ల విషయానికి వస్తే..
* ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో సీట్లు ఎవరికి ఎన్ని అంటే?
Andhrapradesh Loksabha seats survey results.
If the elections are held right now.
YSRCP: 18
TDP+JSP: 07
BJP: 00
Congress: 00Expected Vote Share for Loksabha elections
BJP: 2%
CONGRESS: 2%
YSRCP: 48.5%
TDP+JSP: 45%
OTHERS: 2.5%#AndhraPradeshElection2024 pic.twitter.com/2QUfWKbcBM— Political Critic (@PCSurveysIndia) January 22, 2024
వైసీపీకి : 18 ఎంపీ సీట్లు
టీడీపీ+జనసేనకు : 07 సీట్లు
బీజేపీ : 0
కాంగ్రెస్ : 0
*లోక్ సభ ఎన్నికల ఓటు షేర్ చూస్తే..
వైసీపీకి : 48.5 శాతం
టీడీపీ జనసేనకు : 45 శాతం
బీజేపీ : 2 శాతం
కాంగ్రెస్ : 2 శాతం
ఇతరులు : 2.5 శాతం
*లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో ఖాతా తెరవని స్పష్టం చేశాయి. ఇక ఓటు శాతం కూడా లోక్ సభకు ఏపీలో కేవలం 0.5 శాతం చొప్పున ఈ రెండు పార్టీలకు పెరిగింది. అంటే ఏపీలో కాంగ్రెస్, బీజేపీ ప్రభావం శూన్యమని తేలింది.