Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 23 మంగళవారం ఓ రాశివారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యారంగానికి చెందిన మరో రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం. అందువల్ల ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
వృషభం:
ఇంట్లో వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెండింగు సమస్యలు పరిష్కారం కావడంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
మిథునం:
ఈ రాశివారికి పనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు నిరాశతో ఉంటారు. ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తుంది.
కర్కాటకం:
వ్యాపారులు కొన్ని రిస్క్ పనులు చేయాల్సి వస్తుంది. కటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలతో ఉల్లసంగా గడుపుతారు. పెండింగు పనులు పూర్తవుతాయి.
సింహ:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల వల్ల ఆకస్మికంగా భయం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులపై శ్రద్ధ వహించాలి. శత్రువులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు.
కన్య:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపుతారు.
తుల:
దూరప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తెలివిగా ప్రవర్తించాలి. తెలియనివారితో ఎక్కువగా చనువుగా ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.
వృశ్చికం:
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి అనుకూలం. ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.
ధనస్సు:
ఈ రాశివారు అకస్మాత్తుగా ఓ శుభవార్త వింటారు. మార్కెటింగ్ లో పనిచేసేవారికి లాభదాయకం. గతంలో ఇచ్చిన అప్పులు వసూలవుతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.
మకర:
విద్యారంగానికి చెందిన వారికి మెరుగైన ఫలితాలు. ఇతులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
కుంభం:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉగ్యోగులకు తోటివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులకు దూరంగా ఉండాలి.
మీనం:
శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. వారితో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. *