https://oktelugu.com/

Revanth Reddy: రేవంత్ రెడ్డి కి పగ్గాలు వేసిన అధిష్టానం..

Revanth Reddy: ‘‘ముందుగా మురిస్తే పండుగ కాదనే’’ సామెత తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఇప్పుడు టీపీసీసీ రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగిందని కాంగ్రెస్ వాదులు గుసగుసలాడుకుంటున్నారు. కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారు ఎవరికైనా సరే ముందు ఉన్న ఊపు తర్వాత నేతల్లో ఉండదని ఇట్టే అర్థమవుతోంది. టీపీసీసీ చీఫ్ గా నియామకైన కొత్తల్లో భారీ ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు పగ్గాలు పడ్డాయన్న చర్చ సాగుతోంది.ఎన్నో ఆశలు పెట్టుకున్నా తిరిగి అదే జరిగిందని అంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2021 / 10:54 AM IST
    Follow us on

    Revanth Reddy: ‘‘ముందుగా మురిస్తే పండుగ కాదనే’’ సామెత తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఇప్పుడు టీపీసీసీ రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగిందని కాంగ్రెస్ వాదులు గుసగుసలాడుకుంటున్నారు. కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారు ఎవరికైనా సరే ముందు ఉన్న ఊపు తర్వాత నేతల్లో ఉండదని ఇట్టే అర్థమవుతోంది. టీపీసీసీ చీఫ్ గా నియామకైన కొత్తల్లో భారీ ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు పగ్గాలు పడ్డాయన్న చర్చ సాగుతోంది.ఎన్నో ఆశలు పెట్టుకున్నా తిరిగి అదే జరిగిందని అంటున్నారు.

    రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా చేయడంతో నిస్తేజంగా చచ్చుబడి ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కు ఎక్కడి లేని ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి రావడంతో తిరిగి కాంగ్రెస్ పుంజుకొని తెలంగాణ రాజకీయాల్లో ప్రబలంగా నిలబడింది. బీజేపీనే వెనక్కి నెట్టేలా తయారవుతోంది. కాకపోతే రేవంత్ రెడ్డి చేసిన తప్పులే ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయని చర్చ సాగుతోంది.

    కాంగ్రెస్ అంటే అసమ్మతి. అసమ్మతి లేని కాంగ్రెస్ పార్టీ ఉండదు. అందరినీ కలుపుకొని పోవడానికి రేవంత్ రెడ్డి సహనంతో పనిచేయాల్సి ఉండగా.. ఆయన ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి శరాఘాతంగా మారాయని అంటున్నారు. తన ఇమేజ్ ను పెంచుకునే చర్యలు రేవంత్ చేపట్టడంతో కాంగ్రెస్ సీనియర్లు దీనిపై అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీంతో సీనియర్లను వదులుకోలేని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి ‘కమిటీ’ వేసి పగ్గాలు వేసిందన్న చర్చ సాగుతోంది.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఒక పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది.. ఏంటీ కమిటీ? ఇంతవరకు ఇది ఎప్పుడూ లేదు. అసలు ఇది ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డికి పగ్గాలు వేసేందుకే ఈ కమిటీ వేశారా? లాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై ‘రామ్ టాక్’ స్పెషల్ ఫోకస్ వీడియో..