Site icon OkTelugu

Festival Unique Offers: ఒక స్కూటర్ కొంటే మరో స్కూటర్ ఫ్రీ.. ఎక్కడంటే?

Festival Unique Offers: Buy One Scooter, Get Another For Free Festival Unique Offers: పండుగల సమయంలో ప్రముఖ వాహన కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే. కొత్త కార్లు, కొత్త బైక్స్ కొనుగోలుపై పలు కంపెనీలు క్యాష్ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నాయి. అయితే ఒక కంపెనీ మాత్రం స్కూటర్ ను కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఒక స్కూటర్ ను కొనుగోలు చేస్తే మరో స్కూటర్ ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. నాగ్‌పూర్‌లోని ఏకే గాంధీ టీవీఎస్‌ డీలర్‌షిప్ ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఈ ఆఫర్ ద్వారా స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. ఎవరైతే టూవీలర్ ను కొనుగోలు చేస్తరో వాళ్లు లక్కీ డ్రాలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో పాల్గొని విజేతగా నిలిచిన వాళ్లకు ఉచితంగా మరో స్కూటర్ లభిస్తుంది.

టీవీఎస్ మోపెడ్, టీవీఎస్ మోటార్‌సైకిల్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందవచ్చు. టూవీలర్ ను కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. టూ వీలర్ ను కొనుగోలు చేసిన వాళ్లకు సంస్థ స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ లో భాగంగా ప్రత్యేకమైన బహుమతిని కూడా అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ టూ వీలర్ ఉచితంగా రాదు కాబట్టి కొంతమందికి నిరాశ తప్పదని చెప్పాలి.

ఈ స్కూటర్ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఈ సంస్థ ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది. సంస్థను ఫోన్ ద్వారా సంప్రదించి ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

Exit mobile version