ఆ ప్రార్ధనల వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం..!

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 13,14, 15 తేదీలలో నిర్వహించిన ప్రార్ధనల వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచమంతా కరోనా భయంతో అతలాకుతలం అవుతున్న సమయంలో.. అన్ని వేల మంది ఒక చోట చేరి ప్రార్ధనలు చేసుకోవడానికి అనుమతులు ఎలా లభించాయి? అధికారుల ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 10:49 am
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 13,14, 15 తేదీలలో నిర్వహించిన ప్రార్ధనల వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచమంతా కరోనా భయంతో అతలాకుతలం అవుతున్న సమయంలో.. అన్ని వేల మంది ఒక చోట చేరి ప్రార్ధనలు చేసుకోవడానికి అనుమతులు ఎలా లభించాయి? అధికారుల ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారిని భారత్ లోకి అనుమతించారు. ఈ సంఘటన వల్ల క్లిష్ట సమయంలో ప్రభుత్వ బాధ్యతాలేమికి తార్కాణంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశమంతా ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న వారిలో పలువురు కరోనా బారిన పడుతుండటం, కొందరు మరణిస్తుండటం కలకలం రేపుతోంది. గడిచిన రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ఆరుగురు మృతి చెందగా, వారందరూ ఢిల్లీ ప్రార్ధనలకు హాజరైన వారేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కర్ణాటక ఢిల్లీ, కాశ్మీర్‌, అండమాన్‌ దీవులతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ సమావేశాల్లో పొల్గొని సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. వీరిలో అనేకమంది తాజాగా కరోనా పాజిటివ్‌ గా తేలుతున్నారు. దీంతో వీరికోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు వీరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి.

ఆంధ్రప్రదేశ్‌ నుండి ఈ ప్రార్థనలకు 369 మంది హాజరైనట్లు అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వీరిలో 256 మందికి పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఒక్క రోజే 21 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 44కి చేరాయి. అత్య ధికంగా ప్రకాశం జిల్లాల్లో 11, విశాఖలో 10, గుంటూరులో 9 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు స్వఛ్చందంగా ముందుకు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. భయపడాల్సిన అవసరం లేదని సకాలంలో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యపరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

తెలంగాణలో కూడా మంగళవారం 15 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరందరూ ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 97కు చేరింది.

తమి