Gold Cash : ఏపీలో భారీగా బయటపడ్డ బంగారం, నగదు..

Gold and cash heavily leaked in AP : ఏపీలో కట్టల పాములు బయటకొచ్చాయి.. భారీ బంగారం కూడా పట్టుబడింది. వీటిని ఎక్కడికి ఎవరు తీసుకెళుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీగా బంగారం, నగదు పట్టుబడడానికి కారణం ఏంటిది? ఈ నగదు, బంగారం ఎవరిది? అన్నది ఆరాతీస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకే ట్రావెల్స్ కు చెందిన 2 బస్సుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల […]

Written By: NARESH, Updated On : April 1, 2022 7:43 pm
Follow us on

Gold and cash heavily leaked in AP : ఏపీలో కట్టల పాములు బయటకొచ్చాయి.. భారీ బంగారం కూడా పట్టుబడింది. వీటిని ఎక్కడికి ఎవరు తీసుకెళుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీగా బంగారం, నగదు పట్టుబడడానికి కారణం ఏంటిది? ఈ నగదు, బంగారం ఎవరిది? అన్నది ఆరాతీస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకే ట్రావెల్స్ కు చెందిన 2 బస్సుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరపల్లి టోల్ ప్లాజా వద్ద బస్సును అడ్డగించిన పోలీసులు తనిఖీలు చేశారు. బస్సు లగేజ్ డిక్కీలలో సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఒక్క బాక్సులోనే రూ.80 లక్షల వరకూ నగదు ఉన్నట్టు అంచనా. ఇలాంటివి అనేక బాక్సులు ఉండడంతో కోట్లలో నగదు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరిచి ఉన్నతాధికారులు వచ్చాక లెక్కించనున్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వెళుతున్న ఏపీ 39 టీబీ 7555 గుర్తించారు. డ్రైవర్ , క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని నగదుపై ఆరాతీస్తున్నారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో బస్సులో 10 కేజీల బంగారం, రూ.4 కోట్ల నగదు గుర్తించారు. వీటిని విశాఖపట్నం తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల విశాఖ పట్నం నుంచే గంజాయి అక్రమ రవాణా ఇతర ప్రాంతాలకు తరలుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక నగదును కూడా అక్కడికే తరలిస్తుండడం అనుమానంగా మారింది. ఇక నక్సలైట్లకు ఈ డబ్బు వెళుతుందా? లేదా ఎవరైనా బిల్డర్లు, రియల్ వ్యాపారులు ఈ డబ్బును తరలిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.