Homeఅంతర్జాతీయంTrump humanity appeal viral message: ట్రంప్ నువ్వు మనిషివైతే.. నీకు మానవత్వం ఉంటే ఒక్కసారి...

Trump humanity appeal viral message: ట్రంప్ నువ్వు మనిషివైతే.. నీకు మానవత్వం ఉంటే ఒక్కసారి ఈ ‘పాపం‘ చూడు

Trump humanity appeal viral message: మంచి యుద్ధం ఉండదు. చెడ్డ శాంతి కూడా ఉండదు. శాంతి కోసం యుద్ధాన్ని చేయకూడదు. యుద్ధంలో శాంతిని వెతుక్కోకూడదు. ఈ భూమ్మీద మనిషి జీవితకాలం చాలా స్వల్పం. అలాంటప్పుడు సాటి మనిషిని చంపడం అత్యంత మూర్ఖత్వం. అన్నింటికీ మించి మనిషి ప్రేమను పంచాలి. శాంతిని పెంపొందించాలి. త్యాగాన్ని ఇనుమడింప చేయాలి. సేవ తత్వాన్ని కొనసాగించాలి. అలాకాకుండా పరాక్రమాన్ని.. సాటి మనుషుల మీద గెలవాలి.. ఇష్టానుసారంగా ప్రవర్తించాలి.. ఏక చత్రాధిపత్యంగా పెత్తనం సాగించాలి అనుకుంటే మొదటి కే మోసం వస్తుంది.

రెండు యుద్దాలను చవి చూసింది

ఈ ప్రపంచం ఇప్పటికే రెండు భీకరమైన యుద్ధాలను చవి చూసింది. ఇంకా అనేక రకాల యుద్ధాల ప్రభావాలను ఎదుర్కొంది. ఈ యుద్ధాల వల్ల ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం.. పర్యావరణ నష్టం విపరీతంగా చోటుచేసుకున్నాయి. లక్షలాదిమంది చనిపోయారు. ఈ యుద్దాల వల్ల జరిగిన నష్టం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పటికే ఇంకా కోలుకోలేదు.

భీకరమైన యుద్ధాలు సాగిస్తూనే ఉన్నాయి

సామ్రాజ్యవాధాన్ని.. దోపిడీ విధానాన్ని.. మూర్ఖత్వమైన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న దేశాలు.. గిట్టని దేశాల మీద భీకరమైన యుద్ధాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధాల వల్ల ప్రపంచం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావాలను చూస్తూనే ఉంది. ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతూనే ఉంది. గత నష్టాలు రాచ పుండు మాదిరిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. కొన్ని దేశాలు ఆ దారుణాల నుంచి ఇప్పటికి పాఠాలు నేర్చుకోలేదు. పైగా మరింత క్రూరంగా ఇతర దేశాల మీద వ్యవహరిస్తున్నాయి.

అన్ని దరిద్రాలకు అమెరికానే కారణం

ఈ ప్రపంచంలో అన్ని దరిద్రాలకు కారణం అమెరికా. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. చమురు కోసం.. సహజ వాయువుల కోసం.. విలువైన ఖనిజాల కోసం.. ప్రాంతాల మీద పట్టు కోసం.. అమెరికా యుద్ధాలు చేస్తూనే ఉంది. గల్ఫ్ దేశాలను.. వెస్ట్రన్ దేశాలను.. మిడిల్ ఈస్ట్ దేశాలను తన సామ్రాజ్యవాదం కోసం బలి పెట్టింది. తాజాగా ట్రంప్ నాయకత్వంలో అమెరికా మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చేస్తోంది. ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేయడానికి భీకరమైన దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల్లో చాలామంది చిన్నారులు చనిపోయారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపాలని.. అమెరికా సాగిస్తున్న మారణకాండ కు చరమగీతం పాడాలని ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారో తెలుసా?

అమెరికా యుద్ధ పిపాస.. ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారో చెబుతూ తెహరాన్ టైమ్స్ అనే పత్రిక ఫస్ట్ పేజీలో ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ లుక్ దెం ఇన్ ద ఐస్.. ట్రంప్ ఒకసారి నీ కళ్ళతో వీరిని చూడు అంటూ.. చనిపోయిన చిన్నారుల ఫోటోలతో ఒక ఫ్రంట్ పేజీ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి ఆ కథనం చూస్తే ఎవరికైనా సరే గుండె బరువెక్కుతోంది. కన్నీరు అదేపనిగా కారుతోంది. కానీ అమెరికా అధ్యక్షుడు మనసు మాత్రం కరగడం లేదు.

రాళ్లకు చలనం ఉండదు

రాళ్లకు చలనం ఉండదు అంటారు. ఇనుప రాతి హృదయం మనసులు కఠినంగా ఉంటారు అంటారు. ట్రంప్ కూడా అలాంటివాడే. అమెరికాను ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించే విధంగా యుద్ధాలు చేస్తున్న అతడు.. చివరికి హిట్లర్ మాదిరిగా దారుణమైన చావు చస్తాడని ఇరాన్ దేశ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడని.. ఏదో ఒక రోజు దీనికి సంబంధించిన ప్రతిఫలం పొందాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version