Imran Khan wife Reham khan : ఇప్పటికే పీఎం కుర్చీ కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మరో పిడుగు పడింది. ఈసారి ఆయన మాజీ భార్య అది వేసింది. ఇప్పటికే సైన్యంతో గొడవ పెట్టుకున్న ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయేందుకు రెడీ అయ్యారు. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ను గద్దె దించేందుకు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇప్పటివరకూ ఇమ్రాన్ కు మద్దతిచ్చిన భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే కనీసం 172మంది ఎంపీలు అవసరం కానీ.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు 168 మంది మాత్రమే మద్దతు ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని పదవిని ఇమ్రాన్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పులి మీద పుట్రలా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గుట్టును ఆయన మాజీ భార్య బయటపెట్టింది. ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘పాకిస్తాన్ ను పరిపాలించే సామర్థ్యం, తెలివితేటలు ఇమ్రాన్ కు లేవని విమర్శలు గుప్పించింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు గత చరిత్ర అంటూ చురకలు అంటించింది. నయా పాకిస్తాన్ పేరు చెప్పి దేశాన్ని భ్రష్టు పట్టించారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టింది.
ఈ క్రమంలోనే ఇమ్రాన్ ను చెత్తతో పోల్చి మరీ ఆయన భార్య అవమానించింది. ‘దేశంలో పేర్చిన చెత్తను శుభ్రం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనికోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఇమ్రాన్ భార్య ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కానప్పుడే పాకిస్తాన్ ఉన్నతంగా ఉందని రెహమ్ ఖాన్ ఎద్దేవా చేశారు. 2018లో నయా పాకిస్తాన్ ను నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టింది. కానీ ప్రజల సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయిన అసమర్థుడని విమర్శించింది.
Imran is history!! I think we should focus on standing together for cleaning the mess Naya Pakistan has left. https://t.co/2Bp04ZDbqY
— Reham Khan (@RehamKhan1) April 1, 2022
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయలేకపోయారని రెహమ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయిన అసమర్థుడని విమర్శించింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ను పరిపాలించే అర్హత ఇమ్రాన్ కు లేదని కుండబద్దలు కొట్టింది.
ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసంలో ఓడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే అందరి పదవులు పోవడం ఖాయం. అదే బ్రహ్మాస్త్రంగా ఆయన వాడాలనుకుంటున్నారు. ఒకవేళ ఇమ్రాన్ దిగిపోతే.. ఆయన స్థానంలో ‘పీఎంఎల్ ఎన్ చీఫ్’ హహబాబ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని కానున్నారు.