Homeఆంధ్రప్రదేశ్‌Liquor prices in Andhra Pradesh: ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు!

Liquor prices in Andhra Pradesh: ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు!

Liquor prices in Andhra Pradesh: ఏపీలో( Andhra Pradesh) మందుబాబులకు గుడ్ న్యూస్. మద్యం ధరలు తగ్గనున్నాయి. కొన్ని ప్రీమియం బ్రాండ్లకు సంబంధించి ధరలు తగ్గించేందుకు నిర్ణయించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉన్న బ్రాండ్లకు సంబంధించి తగ్గించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఓ 20 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి. అయితే ధర తగ్గించడం ద్వారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం మెరుగుపడుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. వేసవిలో మందుబాబులకు ఇది నిజంగా శుభవార్త. ఏకంగా 20 బ్రాండ్లకు సంబంధించి ధర తగ్గడం అంటే చిన్న విషయం కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రీమియం బ్రాండ్లు ఏపీలో పెరిగాయి. కానీ ధర అధికంగా ఉంది అన్న కామెంట్స్ ఉన్నాయి. అందుకే తగ్గించేందుకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

పక్క రాష్ట్రాల మద్యం చలామణి
ప్రధానంగా విదేశీ స్కాచ్ మద్యం( foreign scatch liquor ) ఏపీలో ధర ఎక్కువగా ఉంది. దీంతో మందుబాబులు పక్కనే ఉన్న తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక నుంచి తెప్పించుకుంటున్నారు. మన రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచ్చలవిడిగా వస్తోంది ఆ కారణంతోనే. ఖరీదైన ఫారిన్ లిక్కర్ సీసా ధర తెలంగాణలో 22 వేల రూపాయలు ఉంటే.. అది ఏపీకి వచ్చేసరికి రూ.25000 పలుకుతోంది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే.. కొన్ని ప్రీమియం బ్రాండ్ ధరలు సగానికి పైగా రెట్టింపుతో ఉన్నాయి. దీంతో అటువంటి మద్యం అమ్మకాలు ఏపీలో తక్కువగా ఉన్నాయి. అయితే వీటి అమ్మకాలు పెరగాలంటే ధర తగ్గించాల్సిందేనని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అందుకే కీలక ప్రతిపాదన చేసింది. దీనిపై క్యాబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. అదే జరిగితే ఏపీలో ఓ 20 బ్రాండ్లకు సంబంధించిన మద్యం ధరలు తగ్గనున్నాయి. తద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

బాటిల్ పై మూడు వేలు తగ్గింపు..
ఖరీదైన ఫుల్ బాటిల్ స్కాచ్ మద్యంపై కనీసం మూడు వేల రూపాయల వరకు తగ్గింపు ఛాన్స్ ఉంది. కూటమి అధికారంలోకి రాగానే దాదాపు 40 బ్రాండ్ల ధరలను తగ్గించింది. కానీ ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గించకపోవడంతో ఆ కేటగిరీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి వస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. ఈ కారణాలతోనే విదేశీ మద్యానికి సంబంధించిన ఓ 20 బ్రాండ్లు ధరలు తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రభుత్వపరంగా ఇప్పటికే నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది. కానీ త్వరలో జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. వెంటనే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అంటే 13న క్యాబినెట్ జరిగిన మరుక్షణం ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version