PMFBY Government Scheme: దేశంలోని రైతులకు ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాలను ప్రకటించింది. వీటిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి. రైతులు ప్రకృతి విపత్తుల ద్వారా పంట నష్టపోయినప్పుడు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని 2016లో అందుబాటులోకి తెచ్చింది. ఇది పంట నష్టపోయిన రైతులకు రక్షణగా ఉంటుంది. అయితే దీని ఫలితం పొందాలంటే ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత పంటం నష్టపోయిన సమయంలో దరఖాస్తు చేసుకుంటే నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని నిధులను విడుదల చేసింది. దీంతో కొందరి రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. మరి తెలంగాణ, ఏపీలో ఈ పథకం ఎలా ఉందంటే?
Also Read: మహిళలకు ఫ్రీ బస్ ద్వారా ప్రయోజనం ఎవరికి.?
Prime Minister Fasal Bima Yojana (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం మంగళవారం రూ. 3900 కోట్లను రిలీజ్ చేసింది. దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.. అయితే ఇప్పటి వరకే బీమా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు పడనున్నాయి. అయితే రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి pmfby.gov.in అనే వెబ్సైట్ కు వెళ్లాలి. పాలసీ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. తమ పంట ఇన్సూరెన్స్ కోసం కొద్ది మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైతులు రూ. 79 చెల్లిస్తే ప్రభుత్వం రూ. పంట నష్టాన్ని బట్టి పరిహారం చెల్లిస్తుంది. ఈ పథకం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆగస్టు 15 వరకు గడువు విధించారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఈ పథకం అమలులో లేదు. దీని అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేందుకు దరఖాస్తు చేసింది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇస్తే వానకాలం పంట నుంచే పసల్ బీమా యోజనకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఫసల్ బీమా యోజన పథకం 2016లో ప్రారంభమైంది. ఈ పథకం కింద రైతులు మినిమం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఆ ప్రీమియం ప్రకారం యాసంగి పంటలకు రెండు వానకాలం పంటలకు 1.5%, వారించ పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతులు వర్షాకాలం లేదా ఇతర సమయాల్లో పంట నష్టపోయినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది. తుఫానులు, కరువు, తెగుళ్ల వంటి సమస్యలు వచ్చినప్పుడు.. రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు వచ్చి పరిశీలన చేస్తారు. నష్టపోయిన శాతాన్ని బట్టి పరిహారం అందిస్తారు. ఆ తర్వాత పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లోకి నేరుగా పడుతూ ఉంటాయి.
Also Read: తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు..!
అయితే చాలామంది రైతులు దీనిపై అవగాహన లేక అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోతున్నారు. పంట బీమాపై వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదు. గతంలో తెలంగాణలో ఈ పథకం అమలులో ఉండేది. అయితే ఇప్పుడు మరోసారి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.