War 2 Movie USA Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు విభిన్నమైన తరహా పాత్రలను ఎంచుకుంటూ సినిమాలను చేయడమే కాకుండా తమ అభిమానులను సైతం అలరిస్తున్నాడు. గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా యుఎస్ఏ లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి… ఇక యూఎస్ఏ లో స్టార్ట్ అయిన ప్రీమియర్లను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: కూలీ దెబ్బ కి హ్యాంగ్ అయిన యాప్.. రజినీకాంత్ అంటే అలా ఉంటది మరి…
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న హృతిక్ రోషన్ కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన వాటన్నింటినీ దాటుకొని ఎలా ముందుకు సాగాడు? అలాగే అతనికి ఎన్టీఆర్ తోడయ్యాడా? లేదంటే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడా? ఇద్దరు కలిసి వచ్చిన ప్రాబ్లెమ్ ను ఏలా ఎదురుకున్నారు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది…
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి ‘అయాన్ ముఖర్జీ’ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. కథని పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్తూ ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. కథలో ఎక్కడా కూడా డివియేట్ అవ్వకుండా దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకొని ఇద్దరు హీరోలకి సమానమైన స్క్రీన్ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారట…ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసీక్వెన్స్ కోసమే సినిమాని చూడొచ్చని ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు చెబుతుండడం విశేషం…
జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందట. సినిమా స్టార్ట్ అయిన 18వ నిమిషంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది… ఇక విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు వర్కౌట్ అయిందట. ఎమోషనల్ సన్నివేశాలలో ఈ ఇద్దరు హీరోలు చాలా అద్భుతంగా నటించినట్టుగా చెబుతున్నారు…
ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి చాలా మంచి పర్ఫామెన్స్ ని ఇవ్వడమే కాకుండా ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారట. ఇక ఎన్టీఆర్ తో పోలిస్తే హృతిక్ రోషన్ కి కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయన కొంతవరకు డామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది…మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట…
ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్టింగ్
ఇంటర్వెల్ సీన్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
కథ
సెకండాఫ్