https://oktelugu.com/

Rajinikanth And Chiranjeevi: చిరంజీవి సినిమా చూసి ఫోన్ చేసిన రజినీకాంత్, పక్కనే ఉన్న ఆయన భార్య షాకింగ్ రియాక్షన్! ఆ సినిమా ఏంటంటే?

చిరంజీవి-రజినీకాంత్ సమకాలీన నటులు. తిరుగులేని స్టార్డం కలిగిన నటులు. కాగా చిరంజీవి నటించిన ఓ చిత్రం చూసిన రజినీకాంత్ ఆయనకు కాల్ చేశాడట. ఆ పక్కనే ఉన్న రజినీకాంత్ భార్య లత ఫోన్ తీసుకుని చెప్పిన మాటలకు చిరంజీవి ఆశ్చర్యపోయాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : September 21, 2024 / 11:07 AM IST

    Rajinikanth And Chiranjeevi

    Follow us on

    Rajinikanth And Chiranjeevi: చిరంజీవి టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఇతర పరిశ్రమలకు చెందిన నటులు, ప్రముఖులు చిరంజీవి మీద ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. అందుకు కారణం చిరంజీవి ప్రవర్తన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్త్వం చిరంజీవిది. ప్రతి ఒక్కరినీ ఆయన గౌరవిస్తారు. ఇక చిరంజీవి-రజినీకాంత్ మంచి మిత్రులు. వీరిద్దరూ కలిసి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రజినీకాంత్, చిరంజీవి తిరుగులేని హీరోలుగా ఎదిగాక, స్క్రీన్ షేర్ చేసుకోలేదు.

    సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు. కాగా చిరంజీవి నటించిన ఓ చిత్రాన్ని రజినీకాంత్ తన భార్యతో పాటు థియేటర్ లో చూశారట. చిరంజీవి కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా ఉంది సైరా నరసింహారెడ్డి. 2019లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయం అందుకుంది. కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చింది. సైరా మూవీ మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.

    ఇది పీరియాడిక్ పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. చిరంజీవికి జంటగా నయనతార, తమన్నా నటించారు. కాగా ఈ చిత్రాన్ని రజినీకాంత్ తన భార్యతో పాటు కలిసి చూశారట. అనంతరం రజినీకాంత్ చిరంజీవికి కాల్ చేశారట. సినిమా చాలా బాగుందని చెప్పారట. ఆ పక్కనే ఉన్న లత రజినీకాంత్ ఫోన్ తీసుకుని… ఏం సినిమా అండి. వండర్ ఫుల్ గా ఉంది. ఒక రోజంతా ఆ సినిమా ఫీలింగ్ లోనే ఉన్నాము… అన్నారట.

    లత రజినీకాంత్ మాటలకు చిరంజీవి ఆశ్చర్యపోయాడట. ఆనందం వ్యక్తం చేశాడట. ఒక స్టార్ హీరో భార్య మరో స్టార్ హీరో సినిమాను పొగడటం నిజంగా గొప్ప విషయం. ఆ విషయం అటుంచితే… చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విశ్వంభర తెరకెక్కుతుంది.

    విశ్వంభర చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. సురభి, ఈషా చావ్లా వంటి యంగ్ బ్యూటీస్ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. విశ్వంభర చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదలైంది. విశ్వంభర చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి విశ్వంభరతో చిరంజీవి పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి..