Operation Sindoor: మన సైన్యం చూపిస్తున్న తెగువ, దూకుడు, ధైర్యం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఉగ్రవాద దేశంపై సాగుతున్న యుద్ధంలో భారత్ డ్రోన్లను కనివిని ఎరుగని రేంజ్ లో వాడింది. ఉగ్రవాద దేశం సైతం అదే స్థాయిలో మనమీదికి ప్రయోగిస్తే.. వాటిని బిఇఎల్ డెవలప్ చేసిన డి-4 వ్యవస్థ నేల కూల్చింది. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం యుద్ధం అంటే విమానాలు ఎక్కువగా కనిపించేవి. ట్యాంకులు ఎక్కువగా దర్శనమిచ్చేవి. శతఘ్నులు, యుద్ధనౌకలు యుద్ధక్షేత్రంలో ఎక్కువగా కనిపించేవి.. అయితే ఉక్రెయిన్ – రష్యా మధ్య జరిగిన పోరు తర్వాత డ్రోన్ల వాడకం అధికమైపోయింది. ఇక ప్రస్తుతం ఉగ్రవాద దేశంతో మనం సాగిస్తున్న పోరులో డ్రోన్ల వాడకం కానీ విని ఎరుగనిస్తాయికి పెరిగిపోయింది.. అటు ఉగ్రవాద దేశం నుంచి కూడా డ్రోన్లు భారీగానే వస్తున్నాయి. ఇక ఎగిరే బాంబులకైతే లెక్కలేదు. ఇక ఇదే సమయంలో ఉగ్రవాద దేశం మన పైకి సంధిస్తున్న డ్రోన్లను తిప్పికొట్టే ఎయిర్ డిఫెన్స్ ను భారత్ డెవలప్ చేసుకుంది. ఉగ్రవాద దేశం చైనా మీద, తుర్కియే మీద విపరీతంగా డిపెండ్ అయింది. అక్కడినుంచి డ్రోన్స్ ఇంపోర్ట్ చేసుకుంది. అయితే వాటిని పడగొట్టడంలో మన డిఫెన్స్ అదరగొట్టింది. వీటిని నేల నాకించేలా చేయడంలో ఎస్ 400, ఆకాష్ వంటి మిసైల్స్ కీ రోల్ ప్లే చేశాయి. ఇక వీటితోపాటు భారత్ ఎలక్ట్రోనిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసిన డీ4 వంటి వ్యవస్థ కూడా మేజర్ రోల్ ప్లే చేసింది.
Also Read: ప్రధాని మోదీ IAF సందర్శన.. ఆపరేషన్ సిందూర్ వీరులకు అభినందన
డీ 4 అంటే ఏంటంటే
డీ 4 అంటే డ్రోన్, డిటెక్షన్, డెటర్, డెస్ట్రాయ్.. ఇందులో ప్రధానంగా రాడార్లు ఉంటాయి. లేజర్లు కూడా ఇమిడి ఉంటాయి. ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్ సెంటర్ వీటిని అభివృద్ధి చేసింది. అయితే ఎక్కువ సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేసే బాధ్యతను భారత్ ఎలక్ట్రోనిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) భుజాలకు ఎత్తుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజిలో బిఈఎల్ లోనే డ్రోన్లకు మళ్లీ ఫైనల్ టచింగ్ అందుతుంది. డి 4 వ్యవస్థలకు ఉపయోగపడే రాడార్లు బెంగళూరు యూనిట్ లో తయారవుతున్నాయి. జామర్లు హైదరాబాదులో రూపుదిద్దుకుంటున్నాయి. ఆ తర్వాత అవి ఆంధ్రప్రదేశ్ లోని బందరు(మచిలీపట్నం) వెళ్తున్నాయి. మచిలీపట్నం యూనిట్ ఎలక్ట్రో ఆప్టిక్ డివైస్ ను తయారు చేస్తోంది. వాటికి రాడార్లు, జామర్లు కస్టమర్ చేసి డీ 4 వ్యవస్థకు ఫైనల్ టచ్ ఇస్తోంది. మొత్తంగా ఆపరేషన్ సిందూర్ లో బందరు కూడా తనవంతు పాత్ర పోషించింది. ఇక్కడే అధునాతనమైన డీ4 వ్యవస్థ డెవలప్ అవుతోంది. “ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం గొప్ప విషయం. అయితే ఇందులో బందరు ప్రాంతానికి పాత్ర ఉండటం మరింత గర్వకారణం దీనిని గొప్పగా భావిస్తున్నామని” బందరు ప్రాంత ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.