PM Narendra Modi: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఖ్యాతి గడిస్తున్నారు. ఏ సర్వే చూసినా ఆయనే ముందుంటారు. అందరిలో అనుకూల పవనాలే వీస్తున్నాయి. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించి తన ఘనత మరోసారి పెంచుకున్నారు. తిరుగులేని నేతగా మరోమారు జయకేతనం ఎగురవేశారు. తనకెవరు ఎదురు లేరంటూ తన ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించుకుంటున్నారు. ప్రపంచంలోనే మేటి నాయకుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా మార్నింగ్ కన్సల్డ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందడం గమనార్హం.
మార్నింగ్ కన్సల్డ్ సంస్థ గ్లోబల్ లీడర్ ఎవరనే దానిపై 13 దేశాల నేతలపై సర్వే నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలవడం గమనార్హం. ఈ నెల 9 నుంచి 15 వరకు భారత్ తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, స్పెయిన్, యూకే లాంటి దేశాల్లో సర్వే నిర్వహించింది. అన్ని దేశాల్లోనూ మోడీకి అనుకూలమైన ఓటింగ్ రావడంతో తిరుగులేని నేతగా మోడీ గుర్తింపు పొందారు.
Also Read: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు
మోడీకి అనుకూలంగా 77 శాతం మంది ఓటు వేసినట్లు తెలుస్తోంది. 17 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది. తర్వాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రస్ కు 63 శాతం మంది ప్రజలు అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు కేవలం 41 శాతం ప్రజలే ఆశీర్వదించారు. ఆయనపై 51 శాతం వ్యతిరేక ఓట్లు పడటం విశేషం. ప్రతి వారం ఈ సర్వే ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజాగా ఈ వారం విడుదల చేసిన ఫలితాల్లో మాత్రం నరేంద్ర మోడీ నెంబర్ వన్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఆయన దరిదాపుల్లో ఎవరు నిలవకపోవడం ఆయన చరిష్మా తగ్గలేదని సూచిస్తోంది. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల విజయం సాధించి తానేమిటో చెప్పకనే చెప్పారు. అందుకే ప్రపంచ నేతల్లో అగ్రగామిగా నిలుస్తున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొంది తానేమిటో నిరూపించుకున్నట్లు తెలుస్తోంది.
77 శాతం రేటింగ్ తో మోడీ గ్లోబల్ లీడర్లలో ముందు నిలవడం గర్వకారణం. ప్రధాని మోడీ ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. నాయకులు సైతం ట్వీట్లు చేస్తున్నారు. మోడీ మరిన్ని విజయాలు సాధించి తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.
Also Read: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్.. ఏపీలొ కొలువుల జాతర.. సేమ్ స్ట్రాటజీ