Chinajiyar Swamy: కేసీఆర్ విభేదాలు.. సమ్మక్క-సారక్కలపై కామెంట్స్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చినజీయర్ స్వామి ఎట్టకేలకు ఈ వివాదాలపై స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. అన్నింటిపై కూలంకషగా కుండబద్దలు కొట్టారు. సమ్మక్క, సారలమ్మలు అసలు దేవతలా..? అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపాయి. పది సంవత్సరాల కిందట ఈ వ్యాఖ్యలు చేసినా.. అవి ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.ఈ మాటలు ఎప్పుడన్నా.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావని కొందరు చర్చలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి ఈ వివాదంపై స్పందించారు. ఏపీలోని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మేడారంలోని సమ్మక్క, సారక్కల గురించి పదేళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు.కొంతమంది దేవతల పట్ల చిన్నచూపు చూసి మాట్లాడుతామని అనడంలో సరైనది కాదు. ఒక నిర్ణయం చేసేటప్పుడు పూర్వపరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనూ పూర్వపరాలను గమనించాలి. అదివాసీ జనాలను ఏదో అన్నానని కొందరు ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ల పేర్లు చెప్పి సొంత లాభాలను వాడుకునే వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. గ్రామ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఆదివాసీలను అవమానించారని అంటున్నారు. వాళ్లు దానిని సవరించుకోవాలి’’ అంటూ చినజీయర్ స్వామి హితవు పలికారు.
Also Read: Puri Jagannadh: అప్పట్లో ‘పూరి’ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు ఒక్క హిట్ లేదు..
ఆదివాసీల కోసం వికాస్ తరంగిణి తరుపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని.. పాఠశాలలు కట్టించామని.. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని. క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించి వాటిని నయం చేస్తున్నాం. 12. 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించాం. ఇన్ని చేసిన మేం ఆదివాసీల గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతాం. ఈ ఇష్యూని పెద్దదిగా ఎందుకు చేస్తున్నారో వారే చెప్పాలి. పనికట్టుకొని ప్రచారం చేసి వారేం సాధించాలనుకుంటున్నారో చెప్పాలి. ఇటీ టీవీ వాళ్లు రష్యా, ఉక్రెయిన్ హడావుడి తగ్గింది. ఏదో ఒకటి హైలెట్ చేయాలని దీనిని ఇష్యూ చేస్తున్నారు.’’ అంటూ చినజీయర్ స్వామి ఆడిపోసుకున్నారు.
సమాజహితం కోరే వాళ్లే అయితే చర్చలు పెట్టండి. పబ్లిసిటీ కోసం అల్ప ప్రచార కార్యక్రమాలు చేయడం మానుకోవాలి. ఇందులో సమాజహితం ఉన్నట్లు కనిపించడం లేదు. అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం చాలా సులభం. ఇలా ప్రజలను రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందవచ్చు. కానీ దీర్ఘకాలికంగా నష్టమే జరుగుతుంది. చెట్టూ, పుట్టా, ప్రకృతిని గౌరవించడం భారతీయ సాంప్రదాయం. దేశ ప్రజలు అలాగే చేస్తున్నారని చినజీయర్ స్వామి హితవు పలికారు.
Also Read: CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు
ఆదివాసీలు కనుక దూరం పెట్టాలి అనే పద్దతి లేదు. హరిజనులైనా సరే ఉత్తములైతే వారిని ఆరాధించాలి. గ్రామాల్లో జీవించిన వాళ్లు చాలా వరకు నిరక్షరాస్యులు. ఆనాటి గ్రామీణ పరిస్థితుల ప్రకారం వారికి దైవత్వం కల్పించారు. ఆ దేవతలు స్వర్గం నుంచి రాలేదు. వారి మంచి గుణం వల్ల దేవతలయ్యారు. వారిని మధ్యలో పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించవద్దు. అసలు విషయం తెలుసుకొని మాట్లాడాలని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.