మోదీకి 13వేల జరిమానా.. ఎందుకో తెలుసా?

దేశ ప్రధాని మోదీ జాతినుద్దేశించి తాజాగా ప్రసంగించారు. కరోనా నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆరోసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ప్రస్తుతం దేశం ఆన్ లాక్ 1.0నుంచి ఆన్ లాక్ 2.0కు వెళుతోందని తెలిపారు. జూలై 31వరకు ఆన్ లాక్ 2.0 ఉంటుందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా సమయంలో తాను మాస్కు ధరించలేదని 13వేల జరిమానా విధించారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రధాని అయిన చట్టానికి అతీతులుకారని.. దేశంలో […]

Written By: Neelambaram, Updated On : June 30, 2020 6:31 pm
Follow us on


దేశ ప్రధాని మోదీ జాతినుద్దేశించి తాజాగా ప్రసంగించారు. కరోనా నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆరోసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ప్రస్తుతం దేశం ఆన్ లాక్ 1.0నుంచి ఆన్ లాక్ 2.0కు వెళుతోందని తెలిపారు. జూలై 31వరకు ఆన్ లాక్ 2.0 ఉంటుందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా సమయంలో తాను మాస్కు ధరించలేదని 13వేల జరిమానా విధించారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రధాని అయిన చట్టానికి అతీతులుకారని.. దేశంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మోదీ సూచించారు.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న కరోనా మరణాలను లెక్కలోకి తీసుకుంటే భారత్ మెరుగ్గా ఉందని తెలిపారు. ఆన్ లాక్ 1.0లో ప్రజలు కొంత నిర్లక్ష్యం చేయడం వల్లనే కేసుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఆన్ లాక్ 2.0లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. కరోనా సమయంలో పేదప్రజలు ఇబ్బందులు పడకుండా మూడునెలలుగా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పేదల జన్ ధన్ ఖాతాల్లో 35వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు తీసుకొచ్చి ప్రజలు ఆకలితో ఉండకుండా చర్యలు చేశామన్నారు. గరీబ్ కల్యాణ్ యోజనకు 1.50లక్షల కోట్లు కేటాయించామని దీనిని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు మోదీ తెలిపారు. రైతులు, ట్యాక్స్ పేయర్స్ కు ఊరట ఇచ్చినట్లు తెలిపారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. నిబంధనలు పాటించనివారు తీరు మార్చుకోవాలని మోడీ సూచించారు. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు అందరూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టానికి ఎవరూ అతీతులుకారని తెలిపారు. సరైన సమయంలో లాక్డౌన్ విధించడం వల్లే దేశంలో లక్షలాది ప్రాణాలను కాపాడుకోగలిగమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ లాక్ 2.0 వర్షాకాలమని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యంవీడి జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మరిని నిలువరించవచ్చని ఆయన తెలిపారు.