స్టార్ హీరోహీరోయిన్లకు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతీ ఇండస్ట్రీలో ఉంటుంది. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం అందరు హీరోలంటే ఎక్కువ స్థాయిలో వీరాభిమానులు ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కల్యాణ్ ను గానీ, మెగా ఫ్యామిలీనిగానీ ఎవరైనా ఏదైనా అంటే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లయినా సరే చిల్చీచెండాడేస్తుంటారు. అలాంటిది ఆర్జీవీ ‘పవర్ స్టార్’ మూవీ అనౌన్స్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?
దర్శకుడు రాంగోపాల్ నిత్యం ఏదోఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. వివాదాలను పెట్టుబడిగా చేసుకుంటూ డబ్బును సంపాదించుకోవడం ఆర్జీవీకి రోటీన్ గా మారింది. పవన్ కల్యాణ్ పై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను కవ్విస్తూ నిత్యం వార్తల్లో నానుతూ ఉంటాడు. నిత్యం మెగా ఫ్యామిలీలోని ప్రతీఒక్కరిని వర్మ సోషల్ మీడియాలో గెలుకుతూనే ఉంటాడు. దీంతో అప్పట్లో నాగబాబు వర్సస్ ఆర్జీవీ మధ్య వివాదం కొన్నిరోజులపాటు నడించింది. పవన్ ఫ్యాన్స్ కూడా ఆర్జీవీ సోషల్ మీడియాలో పలురకాలుగా టార్గెట్ చేశారు. గతంలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీలోనూ పవన్ ను టార్గెట్ చేసి తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడు.
తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?
కొద్దిరోజులపాటు స్తబ్ధుగా ఉన్న ఆర్జీవీ మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడు. తాజాగా ‘పవర్ స్టార్’ మూవీని తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈమేరకు పవన్ కల్యాణ్ పాత్రలో నటించబోయే వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీని టార్గెట్ చేస్తే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే దీనిని ముందుగానే గుర్తించిన పవన్ ఫ్యాన్స్ ‘పవర్ స్టార్’ విషయంలో సైలెంటై వర్మకు షాకిచ్చారు. ఈమేరకు ‘పవర్ స్టార్’ మూవీని పట్టించుకోకూడదని పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అని తెలుస్తోంది. ఆర్జీవీ చిప్స్ ట్రిక్స్ కు లొంగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. నిత్యం వివాదాలతో సొమ్ముచేసే ఆర్జీవీకి పవన్ ఫ్యాన్స్ ఎట్టకేలకు దిమ్మతిరిగేలా షాకిచ్చినట్లు అయింది. దీంతో వర్మ మరేదైనా కాంట్రావర్సీకి తెరలేపుతారా? అనే చర్చ మొదలైంది.