
2014లో బీజేపీతోనే కలిసి వెళ్లారు.. విజయం సాధించారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వని మోడీపై కత్తిగట్టారు.. 2019 ఎన్నికల ముందర మోడీని ఓడిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేసి మరీ కాంగ్రెస్ పంచన చేరారు. అలా ముందే సగం ఓడారు. బాబును రాంగ్ డైరెక్షన్ లో పంపించి టీడీపీ అనుకూల మీడియా పెద్ద తప్పు చేసిందనే వాదన ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు. మోడీ గెలిచాడు. నాడు చేసిన మోసంతో ఇప్పుడు చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితిలో లేదు. అందుకే తాజాగా మరోసారి ట్రై చేసినా బీజేపీ నుంచి చంద్రబాబుకు నిరాశే ఎదురైందట..
ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?
చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఓడాక కానీ తత్త్వం బోధపడలేదు. అందుకే ఓడిపోగానే బీజేపీని దువ్వసాగారు. రాజ్యసభలో బిల్స్ పాస్ చేసుకునే బలం లేని బీజేపీకి తన నలుగురు రాజ్యసభ ఎంపీలను పువ్వులో పెట్టి మరీ సాగనంపి బీజేపీతో సాన్నిహిత్యానికి అర్రులు చాచారు. ఆ తర్వాత అప్పట్లోనే ఆర్ఎస్ఎస్ నేతలను కలిసి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు..
తాజాగా ఇటీవల మరోసారి ఆర్ఎస్ఎస్ నేతలతో చంద్రబాబు మాట్లాడినట్టు టీడీపీ శిబిరం నుంచి వార్తలు లీక్ అవుతున్నాయి. ఈసారి మాట తప్పనని.. ఖచ్చితంగా బీజేపీతోనే ఉండాలన్న తన నిర్ణయాన్ని చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలపైనే చంద్రబాబు పొత్తు విషయం పెట్టినట్టు సమాచారం.
వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?
దీంతో చంద్రబాబులో బీజేపీ పొత్తు ఆశలు అడుగంటాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అంత ఉత్సాహం చూపడం లేదట.. వాడుకొని వదిలేసే బాబు నైజం తెలిసి టీడీపీతో పొత్తు వద్దే వద్దంటున్నారట ఏపీ బీజేపీ నేతలు..
ముందుగా జనసేనను పంపి ఆ తర్వాత తాను బీజేపీతో కలిసిపోవాలని చూసిన చంద్రబాబు ప్లాన్లకు ఇప్పుడు ఏపీ స్థానిక నేతలే అడ్డుగా తయారయ్యారట.. చంద్రబాబుది మునిగిన నావ అని.. ఆయనతో పొత్తు వద్దని ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి ఖరాఖండీగా చెబుతున్నారట.. దీంతో జనసేన, బీజేపీతో కలిసి 2023 ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న చంద్రబాబు ఆశలు నెరవేరేలా కనిపించడం లేదట.. ఇలా బాబు ఆశలపై బీజేపీ నీళ్లు చల్లుతోందని అంటున్నారు.