Homeజాతీయ వార్తలుమోడీ గ్రాఫ్ పడిపోతోందా?

మోడీ గ్రాఫ్ పడిపోతోందా?


రెండు నెలలుగా ఎవరికీ జీతాలు లేవు.. చేసుకుందామంటే పనులు లేవు. కూలీలు, పేదలు, మధ్యతరగతి, ఉద్యోగులు.. దేశ ప్రజలంతా ఇంట్లోనే ఉన్నారు. మోడీసార్ 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే ఎగిరి గంతేశారు. తమకు అంతో ఇంతో వస్తుందని ఆశపడ్డారు.కానీ మోడీ నీళ్లు చల్లారు. జన్ ధన్ ఖాతాల్లో వేసిన రూ.500తోనే బతకమన్నాడు. అది దేశజనాభాలో కొద్దిమందికే అందాయి.? మరి ఆ 20 లక్షల కోట్లు ఎటు పోయాయి?

*కుప్పకూలిన స్టాక్ మార్కెట్
మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే దేశ ప్రజానీకం.. మార్కెట్ ఆశగా చూశాయి.తమను ఈ కరోనా-లాక్ డౌన్ కష్టకాలం నుంచి గట్టెక్కిస్తుందని ఆశపడ్డాయి. కానీ.. ప్చ్.. ఆశలు అడియాశలయ్యాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఈరోజు కుప్పకూలింది. బ్లాక్ మండేలో 1000 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది. నిజంగా మోడీ అంత మంచి ప్యాకేజీ ఇస్తే.. 20లక్షల కోట్ల భరోసా కల్పిస్తే ఈ స్టాక్ మార్కెట్లు ఎందుకు కుప్పకూలుతాయి?

*లాక్ డౌన్ తో దెబ్బతింటే ఏమిచ్చావ్ మోడీ?
లాక్ డౌన్ తో రెండు నెలలుగా ఉపాధి లేక మధ్యతరగతి,పేదలు ఇబ్బందులు పడుతున్నారు.. పట్టణాలు, నగరాల్లో చిరుద్యోగులు డబ్బులు లేక విలవిలలాడుతున్నారు. వారికి అంతో ఇంతో ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ పరిశ్రమలు, కార్పొరేట్లకు ఇచ్చి రుణాలు తీసుకోండి అంటూ మోడీ జనాల చెవిలో పిచ్చిపూలు పెట్టేశారు. 20 లక్షల ప్యాకేజీలో సామాన్య ప్రజలకు కనీసం 20 రూపాయలు కూడా లబ్ది చేకూర్చిన పాపాన పోలేదు. రెండు నెలలుగా సంపాదన లేని ప్రజలు ఎలా ముందుడుగు వేయాలో తెలియక ఉంటే.. మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ నీటి మూట అని తెలిసి ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

*దేశంలోని రుణఎగవేతదారులకు అప్పులు రద్దు చేసిన మోడీ
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సాంబశివరావు సహా బ్యాంకులకు కన్నాలు వేసిన బడా బ్యాంకు రుణఎగవేత దారులకు అప్పుల రద్దు పథకం అమలు చేసిన మోడీ.. దేశంలోని మధ్యతరగతి ప్రజల లోన్లు, అప్పులు మాత్రం మారటోరియం విధించి మూడు నెలలు వాయిదా వేయించడం జనంలో ఆగ్రహానికి కారణమైంది.

*మోడీ గ్రాఫ్ పడిపోయిందన్న న్యూయార్క్ టైమ్స్
ఇన్నాళ్లు మోడీ ఏదో చేస్తాడని ఉత్తరాధి జనం ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. దక్షిణాదిలోనూ సామాన్యుడైన మోడీ తమ కష్టాలు తీరుస్తాడనుకున్నారు. అయితే ఇప్పుడు ఇంతటి కష్టకాలంలో పైసా విదిల్చని మోడీ తీరు చూశాక జనంలో ప్రబలమైన మార్పు కనిపిస్తోందని.. మోడీపై వ్యతిరేకత వస్తోందని.. ప్యాకేజీలో ఏమీ ఇవ్వని తీరుపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారని ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. దీంతో మోడీ గ్రాఫ్ పడిపోతోందని చెప్పకనే చెప్పింది..

–నరేశ్ ఎన్నం

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version