ఉద్యోగులపై డిప్రెషన్.. దేశానికి చేటా?

కావాల్సినంత జీతం.. సుఖమైన జీవితం.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగం.. ఈ మూడు ప్రపంచప్రఖ్యాత టెక్ దిగ్గజం ‘గూగుల్’ సంస్థలో ఉంటాయట.. అందుకే అక్కడి ఉద్యోగులు అద్భుతాలు చేస్తారు. ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థగా గూగుల్ ను నిలబెట్టారు. అదే కాదు.. ఇప్పుడు ప్రఖ్యాత సంస్థల్లోనూ ఇలానే మంచి వాతావరణం ఉంటే పనులు వాటంతట అవే అవుతాయి. ఉద్యోగులు అద్భుతాలు చేసి కంపెనీని ఓ రేంజ్ కు తీసుకెళతారు. కానీ ఇప్పుడొచ్చిన సంక్షోభంతో మన మేధాశక్తి తగ్గిపోతోంది. నశిస్తోంది. […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 6:29 pm
Follow us on


కావాల్సినంత జీతం.. సుఖమైన జీవితం.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగం.. ఈ మూడు ప్రపంచప్రఖ్యాత టెక్ దిగ్గజం ‘గూగుల్’ సంస్థలో ఉంటాయట.. అందుకే అక్కడి ఉద్యోగులు అద్భుతాలు చేస్తారు. ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థగా గూగుల్ ను నిలబెట్టారు. అదే కాదు.. ఇప్పుడు ప్రఖ్యాత సంస్థల్లోనూ ఇలానే మంచి వాతావరణం ఉంటే పనులు వాటంతట అవే అవుతాయి. ఉద్యోగులు అద్భుతాలు చేసి కంపెనీని ఓ రేంజ్ కు తీసుకెళతారు. కానీ ఇప్పుడొచ్చిన సంక్షోభంతో మన మేధాశక్తి తగ్గిపోతోంది. నశిస్తోంది. ఆలోచనలను ఒత్తిడి చంపేస్తోంది. ఇలాంటి వాతావరణంలో బతకడం తప్పితే సృజనాత్మకత ఉద్యోగుల్లో లోపిస్తోందని సంచలన నివేదిక బయటపెట్టింది.

*డిప్రెషన్ లో 61శాతం మంది ఉద్యోగులు
మావెరిక్స్ ఇండియా ఇటీవల నిర్వహించిన రీబూటింగ్ 2020: ఎ స్టోరీ ఆఫ్ కరోనా-షిఫ్టింగ్ పర్సెప్షన్స్” నివేదిక సంచలన విషయాన్ని బయటపెట్టింది. 61 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారని తేల్చారు. పని భారం పెరిగిందని మహిళా ఉద్యోగులు భావిస్తుండగా, పురుష ఉద్యోగులు తమ ఉద్యోగాల భవిష్యత్తు మసకబారినట్లు భావిస్తున్నారు.

*వర్క్ ఫ్రం హోంతో అనర్థాలు..
మరో ఆందోళన కలిగించే అంశాన్ని కూడా సర్వే సంస్థ బయటపెట్టింది. 75 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాలనుకుంటున్నారు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం కంటే ఆఫీసు నుండి పనిచేయడం మంచిదని భావిస్తారు. పని వాతావరణం లేకపోవడం.. పిల్లలు, భార్య పోరుతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నారు. ఇక సరైన సౌకర్యాలు ఇంట్లో లేకపోవడం కూడా మరో కారణంగా ఉంది.అయితే మేనేజ్ మెంట్ల ధోరణి భిన్నంగా ఉంది. ఉద్యోగులతో ఇంటి నుండి పని వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుందని మేనేజ్‌మెంట్లు భావిస్తున్నాయి.

*రెండేళ్ల వరకు ఉద్యోగులకు కష్టమే..
ఆర్థిక వ్యవస్థ గాడినపడడానికి కనీసం రెండేళ్ళకు పైగా పడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కనీసం 90 శాతం మంది నిపుణులు ప్రస్తుత పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుద్ధరించడానికి కనీసం ఒక సంవత్సరం అయినా పడుతుందని భావిస్తున్నారు. దీంతో రాబోయే ఆరు నెలల వరకు కనీసం 67 శాతం మంది ఉద్యోగులంతా అడుగు బయటపెట్టకుండా ఇంట్లోనే బందీ అయిపోవాల్సిన పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు. వారంతా బయట వాతావరణంలోకి రాకపోతే వారి మానసిక సామర్థ్యాలు తగ్గుతాయని.. కంపెనీలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని సర్వేలో తేలింది.

* ఉద్యోగుల్లో నిరాశ.. ఫలితాలపై తీవ్ర ప్రభావం
ఈ మహమ్మారితో ఉద్యోగ భద్రత.. జీవనం.. జీవితం గందరగోళంగా మారింది. సగం జీతాలతోపాటు అసలు ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఎవ్వరూ మనసు పెట్టి పనిచేసే వాతావరణం కనిపించడం లేదు. ఉద్యోగులు, ముఖ్యంగా ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన యువ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందట. ఉద్యోగ అభద్రత లేకపోవడం.. వర్క్ ఫ్రం హోంతో ఇబ్బందులతో జీవితం అనిశ్చితిగా మారిందంటున్నారు. వారంతా ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందోననే దానిపై తీవ్ర గందరగోళంలో ఉన్నారు.దీంతో చాలా మంది ఉద్యోగులు తీవ్ర నిరాశ.. ఆందోళనతో పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయని.. వీటివల్ల కంపెనీల ఫలితాలపై ప్రభావం పడుతుందని సర్వే సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది.

-నరేశ్ ఎన్నం