Homeఎంటర్టైన్మెంట్ఆర్జీవీ కొత్త హారర్ మూవీ '12 ఓ క్లాక్'.. ఈ రోజే ట్రైలర్

ఆర్జీవీ కొత్త హారర్ మూవీ ’12 ఓ క్లాక్’.. ఈ రోజే ట్రైలర్


కరోనా దెబ్బకు సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోయి ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు దాదాపు మూడు నెలల నుంచి ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కరోనా భయంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఒకటి రెండు చిన్న చిత్రాలు మినహాయిస్తే.. పెద్ద ప్రాజెక్టుల విషయంలో అనిశ్చితి నెలకొంది. థియేటర్లు ఇప్పట్లో పున: ప్రారంభమయ్యే చాన్స్‌ లేకపోవడంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొంత మంది నిర్మాతలు ధైర్యం చేసి ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ముందుకొస్తున్నారు. టాలీవుడ్‌ మాత్రమే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీల పరిస్థితి ఇలానే ఉంది.

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మోడీకి తెలుసు

ఇలాంటి టైమ్‌లో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. లాక్‌డౌన్‌లోనూ షూటింగ్స్‌ చేస్తూ అందరికీ సవాల్‌ విసురుతున్నాడు. ఇప్పటికే మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’, స్వీటీ అనే తెలుగమ్మాయితో ‘నగ్నం’ సినిమాలు చేసిన డిజిటల్‌ రిలీజ్‌ చేశాడు. ‘కరోనా’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. గాంధీని చంపిన గాడ్సే జీవిత చరిత్ర ఆధారంగా ‘ది మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంధీ’, ‘మర్డర్ కుటుంబ కథా చిత్రమ్’, ‘పవర్ స్టార్’ సినిమాలను అనౌన్స్‌ చేశాడు. ఇప్పుడు మరో సినిమాతో ముందుకొస్తున్నాడు. తన తదుపరి చిత్రానికి ‘12 ఓ క్లాక్‌’ అనే టైటిల్‌ పెట్టినట్టు ఆర్జీవీ తెలిపాడు. మైండ్ ఈజ్‌ స్కేరియెస్ట్‌ అనేది ఉప శీర్షిక.

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. పరిస్థితి చేయిదాటుతోందా?

ఆర్జీవీనే డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రానికి టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ ఎమ్‌ ఎమ్‌ కీరవాణి స్వరాలు అందించాడు. ఈ మూవీ టీజర్ను ఈ రోజు (శుక్రవారం) రాత్రి ఏడు గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్టు రాము ట్వీట్టర్లో వెల్లడించాడు. తన రీసెంట్‌ మూవీస్‌ మాదిరిగా ఇది షార్ట్‌ఫిల్మ్‌ కాదని, గంటా 45 నిమిషాల పూర్తి నిడివితో పూర్తి స్థాయి హారర్ చిత్రమని ప్రకటించారు. ప్రేక్షకులు సొంత ఊహలతో తమను తాము భయపెట్టుకునేప్పుడు హారర్ అనేది మరింత ప్రభావం చూపుతుందని ఆర్జీవీ అన్నారు. రాత్‌, భూత్‌ చిత్రాల్లో ఉపయోగించిన ఈ టెక్నిక్‌ను ఇప్పుడు ‘12 ఓ క్లాక్‌’లో వాడుతున్నట్టు తెలిపాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version