ప్రధాని నరేంద్ర మోడీ లఢఖ్ పర్యటనలో భాగంగా సైనిక ఆసుపత్రిని సందర్శించిన ఫొటోలు తాజాగా వివాదానికి తెరలేపాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని లఢఖ్ పర్యటన ఒట్టి ప్రచార స్టంట్ ఆయన ఫొటోలు షేర్ చేస్తూ ఎగతాళి చేస్తున్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా మోడీ పర్యటనను ఎద్దేవా చేశాడు. నాడు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో గాయపడిన సైనికులను సందర్శించిన చిత్రాలను ఇప్పుడు మోడీ ఫొటోలను పక్కపక్కన షేర్ చేసి ట్వీట్ చేసి ‘‘ఈ చిత్రాలే చెప్తాయి మిలియన్ వర్డ్స్’’ అంటూ ట్వీట్ చేశారు. మోడీది ఒట్టి ప్రచార స్టంట్ అని ట్వీట్ లో దెప్పిపొడిచాడు.
నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ సైనిక ఆస్పత్రి సందర్శనలో పక్కన వైద్యులు.. సైనికులకు గ్లూకోజ్ పెట్టి చికిత్స పొందుతున్నట్టు ఉంది. ఒక కాన్ఫరెన్స్ హాల్ ను ఒక ఆసుపత్రిలా మార్చి అందులో ఉంచారు. వారు గాయపడ్డా వారికి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టలేదు. వైద్య పరికరాలు మందులు లేవు.. వైద్యుడి స్థానంలో ఫోటోగ్రాఫర్ లు కనిపించారు. దీన్ని బట్టి మోడీ సైనికుల పరామర్శ కేవలం స్టంట్ అని కాంగ్రెస్ నేత పీ.చిదంబరం విమర్శించాడు.
అయితే చిదబంరం చేసిన విమర్శలలో ఎంతోకొంత నిజాలున్నాయని అనేకమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైద్యులు లేని ఆసుపత్రి, గ్లూకోజ్ బాటిల్స్ కూడా పెట్టని గాయపడిన సైనికులు..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.