రైతులకు మరో వరం ప్రకటించిన జగన్..!

ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను సచివాలయం గోడలకు అంటించి, వాగ్దానాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్న జగన్ ఆ దిశగా ముందుకు వెళుతున్నాడు. కేవలం ఎన్నికలకు నెలల ముందు హామీల అమలు మొదలుపెట్టి, ఓట్లు దండుకునే రాజకీయం తనది కాదని నిరూపిస్తున్నాడు. ముఖ్యంగా రైతు పక్షపాతిగా అనేక పథకాల అమలుతో వారికి చేరువ అవుతున్నాడు. రైతు భరోసా పథకం క్రింద అర్హులైన రైతులకు […]

Written By: Neelambaram, Updated On : July 6, 2020 4:38 pm
Follow us on


ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను సచివాలయం గోడలకు అంటించి, వాగ్దానాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్న జగన్ ఆ దిశగా ముందుకు వెళుతున్నాడు. కేవలం ఎన్నికలకు నెలల ముందు హామీల అమలు మొదలుపెట్టి, ఓట్లు దండుకునే రాజకీయం తనది కాదని నిరూపిస్తున్నాడు. ముఖ్యంగా రైతు పక్షపాతిగా అనేక పథకాల అమలుతో వారికి చేరువ అవుతున్నాడు. రైతు భరోసా పథకం క్రింద అర్హులైన రైతులకు ఇప్పటికే విడతల వారీగా ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు ఉచిత విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

వీటితో పాటు జగన్ రైతులకు ఇచ్చిన మరో ఎన్నికల హామీ నెరవేర్చడానికి విధివిధానాలు సిద్ధం చేశారు. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఉచిత బోరు బావి పథకాన్ని పొందుపరిచారు. అర్హులైన ప్రతి రైతుకు బోరుబావి ప్రభుత్వం తరుపున నిర్మించి ఇస్తామని చెప్పడం జరిగింది. చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూర్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకానికి అర్హత, మార్గదర్శకాలు ఆ శాఖ విడుదల చేసింది.

జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!

కనీసం రెండున్నర ఎకరం భూమి ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడు అవుతాడు. అంతభూమి లేనివారు ఇద్దరు ముగ్గురు కలిసి పథకానికి అప్లై చేసుకోవచ్చు. గరిష్టంగా 5 ఎకరాలకు మించి ఉన్నారు ఈ పథకానికి అనర్హులు. భూమి పట్టా, పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీ ద్వారా గ్రామసచివాలయాలలో లేదా నేరుగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పరిశీలన అనంతరం అర్హులైన వారి జాబితా గ్రామ సచివాలయానికి చేరుతుంది. తద్వారా ఆర్తులైన రైతుల పొల్లాలో ప్రభుత్వం బోరుబావి నిర్మించి ఇస్తుంది. రాష్ట్రంలో సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా భారీ లబ్ది చేకూరనుంది.