spot_img
Homeజాతీయ వార్తలుPM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం లేదు. వారు కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. దీంతో ఢిల్లీలో వాతావరణం రణరంగంలాగా మారిపోయింది. ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాలంలో పేపర్ లీకేజీలు జరిగినట్టుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే మీడియా ముందు విద్యార్థుల కోసం శోకాలు పెడుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంచలన ట్వీట్ చేశారు. దాని దాని ప్రకారం..” దేశంలో యువత సంక్షేమం.. భవిష్యత్తు కంటే ఏది ముఖ్యమైనది లేదు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన ముఠా విషయంలో ఉపేక్షించేది లేదు. వారిని శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని” నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఆయన అలా ట్వీట్ చేశారో లేదో.. ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా సంచలనగా మారింది. జాతీయ భద్రత చట్టాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు వెంటనే డి టెన్షన్ పవర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రకారం నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్ ప్రకారం ఎవరినైనా ఎలాంటి అధికారిక అవయోగాలు లేకుండానే 12 రోజుల నుంచి 12 నెలల వరకు నిర్బంధించడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 18 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. కేంద్రం దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో జూలై 15వ తేదీ అన్నట్టుగా ఉండడం విశేషం.

నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన పరిస్థితులపై ఆగ్రహం గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. జరిగిన గొడవలకు కారణం ఎవరు.. నీట్ పరీక్ష రాసి.. ర్యాంకులు వెల్లడించినప్పటికీ కూడా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు.. ఎందువల్ల ఇదంతా జరుగుతోంది అనే కోణాలలో నరేంద్ర మోడీ సమాచారం తెప్పించుకున్నారు. పైగా దీని వెనక విదేశీ శక్తులు కూడా ఉన్నట్టు ప్రధానమంత్రి అనుమానిస్తున్నారు. దీనికి తోడు దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకం కావడం.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చడం వంటివి సరికొత్త అనుమానాలను కలిగిస్తున్నాయి. అందువల్లే ఈ వ్యవహారం వెనుక ఉన్న శక్తులను బయటికి లాగడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.. అందువల్లే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper