ఆ రోజు రాత్రి 9.09గంటలకు జాతీయవాదం!

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్ 5 రోజు రాత్రి 9.09 గంటలకు జాతీయవాదాన్ని చాటి చెప్పే విధంగా యావత్ భారతదేశం  సిద్ధం కావాలని పీఎం మోడీ పిలిపించారు. ఈ రోజు ఒక వీడియో సందేశాన్ని ఇస్తానని చెప్పిన మోదీ.. అనుకున్నట్లుగానే ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. చాలా దేశాలు మన లాక్‌ డౌన్‌ను పాటిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 4:53 pm
Follow us on

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్ 5 రోజు రాత్రి 9.09 గంటలకు జాతీయవాదాన్ని చాటి చెప్పే విధంగా యావత్ భారతదేశం  సిద్ధం కావాలని పీఎం మోడీ పిలిపించారు. ఈ రోజు ఒక వీడియో సందేశాన్ని ఇస్తానని చెప్పిన మోదీ.. అనుకున్నట్లుగానే ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. చాలా దేశాలు మన లాక్‌ డౌన్‌ను పాటిస్తున్నాయి.

ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నాం. దేశమంతా ఒక్కటై యుద్ధం చేస్తున్నాం. ఇంకా చేయాలి. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తాం. ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను ఎదిరిస్తున్నాం. లాక్‌డౌన్‌లో ఉన్నా మనం ఒంటరి కాదు. ఏకమై సాగిస్తున్న పోరాటం. జనతా కర్ఫ్యూలోనూ ప్రజలు శక్తి సామర్థ్యాలు చాటారు.’ అని ప్రధాని అన్నారు.

కరోనాను తరిమికొడుతున్నామన్న ఐక్యతను చూపించేందుకు ఏప్రిల్ 5న దేశప్రజలంతా జాగరణ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘రాత్రి 9.09 గంటలకు దేశప్రజలంతా జ్యోతులు వెలిగించాలి. లైట్ ఉంటే లైట్, కొవ్వొత్తి ఉంటే కొవ్వొత్తి, ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్ వెలగించాలి. ఇంట్లోని విద్యుత్తు దీపాలు ఆర్పేసి బాల్కనీలోకి రావాలి.’ అని మోదీ అన్నారు. ఈ మేరకు 9 నిమిషాల నిడివితో వీడియోను విడుదల చేశారు.