https://oktelugu.com/

కరోనా పుణ్యమా అని పెరిగిన ‘టి ఆర్ పీ’

కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీ కి చాలా నష్టాన్నికలిగించింది. లాక్ డౌన్ వల్ల .సినీ ప్రేక్షకులు ఇంట్లోని టీవీ లకు అతుక్కు పోయారు. దాంతో ఛానల్స్ లో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్పీ బాగా పెరిగింది.. చిన్న సినిమాలకు సైతం మంచి టీఆర్ఫీ వచ్చింది. ఇక స్టార్ హీరోల సినిమాలకు అయితే తిరుగులేని ఆదరణ లభించింది . ఆ క్రమంలో వచ్చిన మహేష్ బాబు సినిమా అల్ టైం రికార్డు సృష్టించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోమారు […]

Written By:
  • admin
  • , Updated On : April 3, 2020 / 02:39 PM IST
    Follow us on


    కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీ కి చాలా నష్టాన్నికలిగించింది. లాక్ డౌన్ వల్ల .సినీ ప్రేక్షకులు ఇంట్లోని టీవీ లకు అతుక్కు పోయారు. దాంతో ఛానల్స్ లో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్పీ బాగా పెరిగింది.. చిన్న సినిమాలకు సైతం మంచి టీఆర్ఫీ వచ్చింది. ఇక స్టార్ హీరోల సినిమాలకు అయితే తిరుగులేని ఆదరణ లభించింది . ఆ క్రమంలో వచ్చిన మహేష్ బాబు సినిమా అల్ టైం రికార్డు సృష్టించింది.

    సూపర్ స్టార్ మహేష్ బాబు మరోమారు బుల్లితెర ఫై తన సత్తా చాటాడు . తన స్టార్ డమ్ ఏపాటిదో మరో మారు నిరూపించాడు బుల్లితెర టీఆర్ఫీ పరంగా ఆల్ టైం రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంక్రాంతికి మహేష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు` విడుదలై టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో స్థానం సంపాదించు కొంది . కాగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా ప్రభంజనం సృష్టించింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ నెట్ వర్క్స్ వారు ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చ్ 25న జెమినీ టీవీ లో ప్రసారం చేశారు. బుల్లితెరపై ఈ చిత్రం 23.4 టీఆర్పీ సాధించి ఆల్ టైం నెంబర్ 1 స్థానం లో నిలిచింది. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టిన బాహుబలి 2 చిత్రం యొక్క టీఆర్పీ 22.7 కాగా అంతకు మించిన టీఆర్పీ రేటింగ్ `సరిలేరు నీకెవ్వరు` దక్కించుకుంది. ఇక .బాహుబలి 2 రెండవ స్థానంలో ఉండగా మిగతా టీఆర్ఫీ ల పరంగా మూడో స్థానంలో శ్రీమంతుడు , నాలుగో స్థానం లో దువ్వాడ జగన్నాధం నిలవగా బాహుబలి మొదటి భాగం అయిదవ స్థానంలో నిలిచింది .