https://oktelugu.com/

గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!

తాను పునాది వేసిన రాజధాని అమరావతి, దానిని కదలకుండా చేసి…తన పేరు సార్ధకం చేసుకోవాలనేది చంద్రబాబు పట్టుదల. దానికి తోడు అమరావతి భూముల అవకతవకలు, అయినవారికి కట్టబెట్టిన ఆస్తుల లెక్కలు బయటకి రాకుండా ఉండాలంటే, రాజధాని మార్పు కానీ, సిఆర్డిఏ చట్టము రద్దు కానీ జరగకూడదు. దీనికోసం అసెంబ్లీ సాక్షిగా జగన్ ని వేడుకున్న బాబు…వినడని తెలుసుకొని తన దగ్గర ఉన్న ఒక్కొక్క ఆయుధం పదునుపెట్టి వదులుతున్నాడు. రాజధానిని వైజాగ్ కి తరలించకుండా ఎవరూ ఆపలేరని జగన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 / 01:26 PM IST
    Follow us on


    తాను పునాది వేసిన రాజధాని అమరావతి, దానిని కదలకుండా చేసి…తన పేరు సార్ధకం చేసుకోవాలనేది చంద్రబాబు పట్టుదల. దానికి తోడు అమరావతి భూముల అవకతవకలు, అయినవారికి కట్టబెట్టిన ఆస్తుల లెక్కలు బయటకి రాకుండా ఉండాలంటే, రాజధాని మార్పు కానీ, సిఆర్డిఏ చట్టము రద్దు కానీ జరగకూడదు. దీనికోసం అసెంబ్లీ సాక్షిగా జగన్ ని వేడుకున్న బాబు…వినడని తెలుసుకొని తన దగ్గర ఉన్న ఒక్కొక్క ఆయుధం పదునుపెట్టి వదులుతున్నాడు. రాజధానిని వైజాగ్ కి తరలించకుండా ఎవరూ ఆపలేరని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఉద్యమాలు జరిగినా, విమర్శల దాడి ఎక్కువైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.

    Also Read: నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

    ఇక ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం చేయడంతో పాటు, సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ బిల్లును ఆమోదించడం జరిగింది. కీలకమైన ఈ రెండు బిల్లులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు చేరాయి. గవర్నర్ ఆమోదిస్తే జగన్ నిర్ణయానికి మార్గం సులభం అవుతుంది, దీనితో ఆయన వీలైనంత తొందరగా వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చివేస్తారు. ఒక వేళ గవర్నర్ ఆమోదం తెలుపకపోతే బాబుగారి అమరావతి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లు అవుతుంది.

    Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

    ఐతే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో స్పష్టత లేని నేపథ్యంలో జగన్ మరియు బాబు ఈ విషయంపైనే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉన్న నేపథ్యంలో వాడవలసిన అస్త్రాలేమిటి అనేది వారి ఆలోచనగా తెలుస్తుంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉన్నప్పటికీ జగన్ కి వచ్చిన నష్టం తక్కువే… కారణం… శాసన సభ చేసిన చట్టాలకు గవర్నర్ సూచనలు మాత్రమే ఇవ్వగలడు కానీ పూర్తిగా రద్దు చేయలేడు. ఒకసారి సూచనల తరువాత శాసన సభ మరలా ఆ బిల్లును గవర్నర్ అనుమతికి పంపితే ఆయన ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు అండ్ టీమ్ కి ఈ విషయంలో ఆశాభంగం తప్పేలా లేదు. గవర్నర్ నేరుగా ఈ బిల్లులకు ఆమోదడం తెలిపితే మాత్రం జగన్ నిర్ణయానికి మరింత బలం చేరుకూరుతుంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.