Atal Bihari Vajpayee Jayanti: వాజ్ పేయి జన్మదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. వాజ్ పేయి చిత్రపటానికి నీవల్ల అర్పించారు.. ఈ సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో సుదీర్ఘమైన వ్యాసం రాశారు. వాజ్ పేయి తో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు..” వాజ్ పేయి భారత దేశ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన తన పరిపాలనలో చెరగని ముద్ర వేశారు. బలమైన, సంపన్నమైన, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో వాజ్ పేయి ముఖ్యపాత్ర పోషించారు. ఆయన దార్శనికత గొప్పది. ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం, సంకల్ప బలం దేశానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చాయి. 1998లో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశంలో రాజకీయ అస్థిరత ఉంది. అంతకుముందు గడచిన తొమ్మిది సంవత్సరాలలో 4 పార్లమెంట్ ఎన్నికలు దేశం ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థిరమైన ప్రభుత్వం పై ఆశలు పెంచుకున్నారు. ఆ సమయంలో నాయకత్వాన్ని వహించిన వాజ్ పేయి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన పరిపాలన అందించారు. వాజ్ పేయి దార్శనికత వల్ల దేశం ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. బహుళ ఎన్నికలకు చెక్ పెట్టడంతో వాజ్ పేయి పనితీరు దేశ ప్రజలకు అర్థమైంది.
ఆ పథకాలు ఆయన చలవే
“స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఢిల్లీ మెట్రో వంటివి వాజ్ పేయి హయాంలోనే చోటు చేసుకున్నాయి. దేశంలో ఐటీ, టెలికాం విప్లవానికి వాజ్ పేయి నాంది పలికారు. దేశ భద్రతకు వాజ్ పేయి చారిత్రాత్మకమైన సేవలు చేశారు. 1998లో పోక్రాన్ అణు పరీక్షలు వాజ్ పేయి హయాంలోనే జరిగాయి. అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రపంచ వేదికపై శాంతిని పెంపొందిస్తూ.. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో వాజ్ పేయి కీలక పాత్ర పోషించారు. ప్రతిపక్ష నాయకుడిగా, మొదటి ఇండియా ప్రభుత్వానికి అధినేతగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో వాజ్ పేయి కీలకపాత్ర పోషించారు.వాజ్ పేయి రాజకీయ ప్రయాణం సమర్థవంతంగా సాగింది. సంకీర్ణ రాజకీయాలను ఆయన పునర్ నిర్వచించారు. అభివృద్ధి, దేశ ప్రగతి పై దృష్టి సారించారు. భిన్నమైన పార్టీలను ఎన్డీఏ గొడుగు కిందికి తీసుకొచ్చారు. అది ఆయనకు ఉన్న సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. రాజ్యాంగం పట్ల వాజ్ పేయి కి నిబద్ధత ఉంది. భారతీయ సంస్కృతి పట్ల ఆయనకు ప్రగాఢమైన నమ్మకం ఉంది.. భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిగా ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ నాయకుడు వాజ్ పేయి. ఇది జాతి వారసత్వంపై ఆయనకు ఉన్న గర్వానికి ప్రతీక. వాజ్ పేయి సాహిత్య మేధావి.. ఆయన రాసిన కావ్యాలు, పదాలు కోట్లాదిమంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయని” నరేంద్ర మోడీ పేర్కొన్నారు.. బుధవారం ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ ప్రాంతాన్ని సందర్శించిన మోడీ.. అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి దత్తత కుమార్తె నమిత కౌల్ భట్టాచార్య కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी 100वीं जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने सशक्त, समृद्ध और स्वावलंबी भारत के निर्माण के लिए अपना जीवन समर्पित कर दिया। उनका विजन और मिशन विकसित भारत के संकल्प में निरंतर शक्ति का संचार करता रहेगा। pic.twitter.com/pHEoDRsi8Y
— Narendra Modi (@narendramodi) December 25, 2024