https://oktelugu.com/

Mileage Cars: కొత్త సంవత్సరంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు కొనాలని అనుకుంటున్నారా..? బెస్ట్ కార్లు ఇవే..

కొత్త ఏడాది సందర్భంగా కొత్తగా వాహనం కొనాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే మంచి కారు కొనాలని అనుకునే వారు మైలేజ్ కి కూడా ప్రాధాన్యత ఇస్తారు. మైలేజ్ విషయంలో మారుతి కంపెనీ ఎప్పుడు ముందు ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 25, 2024 / 01:02 PM IST

    Mileage Cars

    Follow us on

    Mileage Cars: కొత్తగా కారు కొనాలనుకునేవారు బడ్జెట్ తో పాటు మైలేజ్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. సాధారణ కార్ల కంటే మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాటికి డిమాండ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు మైలేజ్ ను బేస్ చేసుకుని కార్లను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తాయి. కొత్త ఏడాది సందర్భంగా కొత్తగా కారు కొనాలనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అందరిని ఆకట్టుకున్నాయి. వీటికి పోటీగా ఎన్నో కాళ్లు వచ్చినా మైలేజ్ విషయంలో మాత్రం వాటికి సాటి లేదు అని నిరూపిస్తున్నాయి. ఇంతకీ ఆ కారులో ఏవో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి..

    కొత్త ఏడాది సందర్భంగా కొత్తగా వాహనం కొనాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే మంచి కారు కొనాలని అనుకునే వారు మైలేజ్ కి కూడా ప్రాధాన్యత ఇస్తారు. మైలేజ్ విషయంలో మారుతి కంపెనీ ఎప్పుడు ముందు ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు కొనాలని అనేవారికి ఈ కంపెనీ బెస్ట్ ఆప్షన్ అని కొందరు నిపుణులు పేర్కొంటారు. మారుతి నుంచి స్విఫ్ట్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. స్విఫ్ట్ న్యూ జనరేషన్ కారు కొన్ని నెలల కింద మార్కెట్లోకి వచ్చింది అయితే పాత Swift దీటుగా కొత్త కారు మైలేజ్ లో ఏ మాత్రం రాజీ పడడం లేదు. 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ తో కూడిన ఈ కారు లీటర్ ఇంధనానికి 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ లో 27.48 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న కార్లలో ఇదే నెంబర్ వన్ గా ఉంది.

    మారుతి కంపెనీకి చెందిన మరో కారు డిజైర్ మైలేజ్ లో తక్కువ ఏమి కాదని నిరూపిస్తోంది. మారుతి కంపెనీ నుంచి Wagon R, స్విఫ్ట్ తర్వాత అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు డిజైర్ మాత్రమే. ఈ కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఉన్న ఈ కారు లీటర్ ఇంధనానికి 24.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ తో పాటు Cng వెర్షన్ కూడా ఆకర్షిస్తుంది. Cng వేరియంట్ లో 33.73 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తోంది.

    డిజైన్ బేస్ గా కార్లు కొనేవారికి హోండా కంపెనీ అనుగుణంగా ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ‘అమేజ్’ మోడల్ సక్సెస్ ఫుల్ గా నిలిచింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన హోండా అమేజ్ కారు లీటర్ ఇంధనానికి 18.65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్లో 19.46 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన ఈ కారు పై వినియోగదారులకు ఎక్కువగా ఆసక్తి ఉంది.

    దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు దేశంలో అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. దీని నుంచి రిలీజ్ అయిన సోనెట్ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మోడల్ లీటర్ ఇంధనానికి 22. 3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ లో 18.6 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

    సిట్రియోన్ కంపెనీకి చెందిన బసాల్ట్ కారు 1.2 లీటర్ టర్బో ఇంజన్ ను కలిగి ఉంది. పై స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ మోడల్ లీటర్ ఇంధనానికి 19.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ పై 18.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.