https://oktelugu.com/

నాయకులపై పెరుగుతున్న వ్యతిరేకత

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలపై వ్యతిరేకత పెరుగుతోంది. రోజురోజుకు ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాలు కొత్తేమీ కాదు. అయినా కరోనా నిరోధానికి చర్యలు తీసుకోవడంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దీంతో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడం పెను సవాల్ గా […]

Written By: , Updated On : May 9, 2021 / 08:53 AM IST
Follow us on

modi kcr jaganప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలపై వ్యతిరేకత పెరుగుతోంది. రోజురోజుకు ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాలు కొత్తేమీ కాదు. అయినా కరోనా నిరోధానికి చర్యలు తీసుకోవడంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దీంతో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడం పెను సవాల్ గా మారింది.

కరోనా కట్టడిలో విఫలం
రాజకీయ పార్టీలు కరోనా కట్టడి చేయడంలో విఫలం అవుతున్నాయి. ఎన్నికలప్పుడు రూ. కోట్లు గుమ్మరించే పార్టీలకు ప్రస్తుతం డబ్బులు లేవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులతోనే కరోనా కట్టడి చేయగలమా? వారిలో సైతం అలసత్వం పెరిగిపోయింది. ఫలితంగా వైద్య సేవలందక ప్రజలు అల్లాడిపోతున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీలు కరోోనా కట్టడి చేయడంలో ఎందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదు. ప్రతి జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు, కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఎందుకు ముందుకు రావడం లేదని సగటు మనిషి ప్రశ్నిస్తున్నాడు.

రాజీనామాలతో పరిస్థితి మారుతుందా?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. వారు రాజీనామా చేస్తే కరోనా కట్టడి అవుతుందా? ప్రజాభిమానంతో గెలిచిన నేతలు అయినందున వారిని రాజీనామా చేయాలనడం కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో ప్రతిపక్షాలు మంచి సూచనలతో ప్రభుత్వాలతో పని చేయంచాలి కాని రాజీనామాలు చేయాలనడం సమంజసం కాదు. నేతల చేతలు సరిగా లేనప్పుడు ప్రజలే ఓటు ద్వారా వారిని ఇంటికే పరిమితం చేస్తారు.

బాధ్యతలు మరువకూడదు
అధికార పార్టీలు బాధ్యతలను మరిచి ప్రవర్తించిన మాట వాస్తవమే. దాని ఫలితమే కరోనా విజృంభన. దీంతో ప్రజలు సమిధలవుతున్నారు. ఉదాసీనత, నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్ల కరోనా పరిధి దాటి పోయింది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ సంప్రదాయానికి చరమగీతం పెట్టాలి. ప్రభుత్వాలు బాధ్యతలు మరిచిపోకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి. అప్పుడే ప్రజామోదం లభిస్తుంది.