చెన్నైకి నాలుగు టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసేందుకు ఆంధ్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం నగరవాసుల తాగునీటి అవసరాలకు ఆంధ్ర ప్రభుత్వం ఏటా 12 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేస్తోంది. అయితే ఏపీలో కూడా నీటి కొరతా ఉండడంతో నీటిని సక్రమంగా విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు 7.65 టీఎంసీల నీరు మాత్రమే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర అధికారులు ఆంధ్ర అధికారులతో కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు అంగీకరించినట్లు, నీటిని త్వరలో విడుదల చేసే అవకాశముందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.