PM Modi: భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ తాలూకు వ్యవహారాలను ఎప్పటికప్పుడు త్రివిధ దళాల అధిపతులు చెబుతూనే ఉన్నారు. లెక్కలతో సహా వెల్లడిస్తూనే ఉన్నారు.. ఎక్కడెక్కడ దాడులు చేసింది.. ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చింది.. ఉగ్రవాద దేశానికి ఏ స్థాయిలో నష్టం చేకూర్చింది.. ఇలా అన్నింటిని దృశ్యాలతో సహా వివరిస్తున్నారు. తాజాగా సోమవారం త్రివిధ దళాల అధిపతులు కీలకమైన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్ పై చేసిన దాడులను.. కలిగించిన నష్టాన్ని.. ఏఏ ప్రాంతాల్లో దాడులు చేసిన విధానాన్ని లెక్కల తో సహా వివరించారు. దానికి తగ్గట్టుగా ఉపగ్రహ చిత్రాలను.. ఖచ్చితమైన ఆధారాలతో సహా వెల్లడించారు. ఇదే కచ్చితత్వం పాకిస్తాన్ వద్ద లేకుండా పోయింది. పైగా భారతదేశానికి సంబంధించిన డ్రోన్లను.. యుద్ధ విమానాలను నేల కూల్చామని పాకిస్తాన్ గొప్పలు పోయింది. అయితే వాటి ఆధారాలను వెల్లడించడంలో పాకిస్తాన్ విఫలమైంది. దీంతో సోషల్ మీడియాలో పాక్ త్రివిధ దళాల పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: పాకిస్తాన్ లో అణువణువు తెలిసిందిలా.. భారత ఆ 10 ఉపగ్రహాలు ఏం చేశాయంటే?
మోడీ కీలక మీటింగ్
త్రివిధ దళాల అధిపతుల మీటింగ్ తర్వాత సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకమైన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ” భారత దళాల దాడిలో ఉగ్రవాద దేశానికి మూడు రోజుల్లోనే ముచ్చెమటలు పట్టాయి. వెంటనే ఆందోళనకు గురై మన డీజీఎంతో కాళ్ల బేరానికి వచ్చింది. ఈ సమయంలో మన ప్రజలపై, గొప్ప గొప్ప విద్యా సంస్థలపై, ఆర్మీ శిబిరాలపై దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించింది. మన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాన్ని గాల్లోనే తుత్తునీయలు చేసింది. మన ఆర్మీ కౌంటర్ టీ ఉగ్రవాద దేశం అతలాకుతలం అయిపోయింది. ఉగ్రవాద దేశంతో ప్రధానంగా చర్చించేది రెండే విషయాలు. ఒకటి ఉగ్రవాదాన్ని ఆదేశం పూర్తిగా పక్కన పెట్టాలి. ఉగ్రవాదాన్ని తొక్కిపెట్టాలి. లేకపోతే పాకిస్తాన్ అనేది కాలగర్భంలోకి వెళ్లిపోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి తన నిర్ణయం ఏమిటో దాయాది చెప్పాలి. లేకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా వరకు వేరే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పిఓకే, ఉగ్రవాదం మినహా వేరే వాటి గురించి చర్చించాల్సిన అగత్యం ఈ దేశానికి పట్టలేదు. ఈ దేశం చాలా బలమైంది. అన్నిటికంటే గర్వమైనది. ఇంకే దేశం పెత్తనం మన దగ్గర సాగదు. ఏ దేశం మాట వినాల్సిన అవసరం ఈ దేశానికి లేదు. ఈ దేశం సార్వభౌమ అధికారం.. సమగ్ర పరిపాలన మిగతా దేశాలకు ఆదర్శమని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎన్ని రోజులపాటు ఒత్తిడి ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ.. ఒక్కసారిగా తన భవిష్యత్ కార్యాచరణ
ను వెల్లడించారు. అంతే కాదు ఆపరేషన్ సిందూర్ ఇంకా లోతుగా వెళుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.