https://oktelugu.com/

PM Modi America Tour: అంబానీ, సుందార్ పిచాయ్, సత్యనాదెళ్ల.. వైట్ హౌస్ లో మోడీ వెంట కార్పొరేట్ దిగ్గజాలు!

శ్వేతసౌధం సౌత్‌లో ఉన్న లాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో ఈ విందు జరిగింది. విందు మెనూలో దాదాపు వెజిటేరియన్‌ వంటకాలే ఉండటం గమనార్హం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 23, 2023 5:14 pm
    PM Modi America Tour

    PM Modi America Tour

    Follow us on

    PM Modi America Tour: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా… ఆయన గౌరవార్థం శ్వేతసౌధం ఏర్పాటు చేసిన విందుకు పారిశ్రామిక వేత్తలు బిలియనీర్లు టెక్‌ దిగ్గజాలు ఫ్యాషన్‌ ఐకాన్‌లు హాజరయ్యారు. అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ దాదాపు 400 మంది అతిథులను ఈ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ విందుకు హాజరైన వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు చైర్‌ పర్సన్‌ నీతా అంబానీ కూడా ఉన్నారు.

    కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా..
    ఈ విందులో భారత బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ కార్పొరేట్‌ దిగ్గజం ఇంద్రానూయి పాల్గొన్నారు. ఈ అతిథుల జాబితా లో మానవహక్కుల ఉద్యమకర్త మార్టిన్‌ లూథర్‌ కింగ్‌–3 టెన్నిస్‌ ఆటగాడు బిల్లీ జేన్‌ కింగ్‌ సినీ ప్రముఖుడు నైట్‌ శ్యామలన్, ఫ్యాషన్‌ డిజైనర్‌ రాల్ఫ్‌ లౌరెన్, వ్యాపారవేత్త ఫ్రాంక్‌ ఇస్లామ్‌ గ్రామీ అవార్డు గ్రహీత జాషువా బెల్‌ తదితరులు ఉన్నారు.

    అదానీకి అందని ఆహ్వానం..
    ఇదిలా ఉంటే అదాని గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీకి వైట్‌హౌస్‌లో విందుకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇటీవల అదానీ గ్రూప్‌ సంస్థల్లో అవకతవకలు జరిగాయాని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మోదీకి అత్యంత సన్నిహితుడైన అదానీకి వైట్‌హౌస్‌లో విందుకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

    వెజిటేరియన్‌ వంటకాలే..
    శ్వేతసౌధం సౌత్‌లో ఉన్న లాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో ఈ విందు జరిగింది. విందు మెనూలో దాదాపు వెజిటేరియన్‌ వంటకాలే ఉండటం గమనార్హం. మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలనూ ప్రత్యేకంగా చేర్చారు. మారినేటెడ్‌ మిల్లెట్‌ గ్రిల్డ్‌ కార్న్‌ కెర్నల్‌ సలాడ్‌ పుచ్చకాయ అవకాడో సాస్‌ అందించగా.. మెయిన్‌ కోర్స్‌లో స్టఫ్డ్‌ పోర్టబెల్లో మష్రూమ్స్‌ కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో లెమెన్‌ దిల్‌ యోగర్ట్‌ సాస్‌ క్రిస్ప్‌డ్‌ మిల్లెట్‌ కేక్స్‌ వేసవి పానీయాలు ఉన్నాయి.

    అమెరికా సంప్రదాయం..
    అమెరికాను సందర్శించే దేశాధినేతల గౌరవార్థం వైట్‌హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వైట్‌ హౌస్‌ హిస్టారికల్‌ అసోసియేషన్‌ ప్రకారం.. స్టేట్‌ డిన్నర్‌ అనేది వైట్‌ హౌస్‌ ముఖ్యమైన వ్యవహారాలలో ఒకటిగా ఉంది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన నరేంద్రమోదీ గౌరవర్థా స్వేత సౌధంలో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనతో భారత్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తాయని పలువురు భావిస్తున్నారు.