PM Kisan
PM Kisan: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 18 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. ప్రస్తుతం బదిలీ చేయబోయే నిధులు 19వ విడతవి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి 24 సోమవారం రోజు 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేస్తారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ ప్రాంతంలో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. దాదాపు 22 వేల కోట్లను 9.8 కోట్ల మంది రైతులకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. నాలుగు నెలలకు 2000 చొప్పున ప్రతి రైతుకు అందిస్తుంది. ఈ విధంగా ఏడాదికి మొత్తం 6000 రూపాయలను మూడు సమాన వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. 18వ విడతలో లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లుగా ఉండేది. ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరిగిన కేంద్ర మంత్రి చౌహాన్ చెబుతున్నారు 18వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది అక్టోబర్ ఐదున మహారాష్ట్రలోని వాషిమ్ ప్రాంతం నుంచి విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దాదాపు 3.46 లక్షల కోట్లను రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇక వచ్చే 19వ విడత ద్వారా మొత్తం 3.68 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేస్తుంది.
2018లో ప్రారంభం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి 2018 డిసెంబర్ 1న నరేంద్ర మోడీ రూపకల్పన చేశారు. 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చా. ఈ పథకం ద్వారా బదిలీ చేసిన నిధులు రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఉపకరిస్తాయని కేంద్రం భావించింది. తద్వారా ఉత్పత్తుల పెరుగుతాయని.. సాగు ఖర్చు తగ్గుతుందని.. రైతుల ఆదాయం పెరుగుతుందని.. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వీలు పడుతుందని కేంద్రం భావిస్తోంది. ” ఈ పథకం దేశంలోనే అతి గొప్పది. రైతులకు ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అవుతున్నాయి. ఈ పథకం ద్వారా రైతులు తమ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు. స్వావలంబనను సాధించవచ్చు. అంతేకాకుండా ఎరువులు, విత్తనాలు వంటి వాటిని కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి ఇబ్బందులేకుండా సాగు పనులు చేపట్టవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం మూడు లక్షల కోట్లకు పైగా నిధులను ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. బహుశా ప్రపంచంలో ఇలాంటి పథకం మరెక్కడాఉండకపోవచ్చని” కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వ్యాఖ్యానించారు. ఐతే ఐటీ కట్టే సామర్థ్యం ఉన్న వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిఎం కిసాన్ నిధులు వారి ఖాతాల్లో జమ కావు.