PM Kisan Yojana: రేపే మీ ఖాతాల్లో డబ్బులు జమ.. ఎంతో తెలుసా?

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని కేంద్రం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతీ విడతలో రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో కలిపి రూ.6 వేలు చెల్లిస్తుంది. ప్రస్తుతం 17వ విడత సాయం విడుదల చేస్తుంది.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 11:01 am

PM Kisan Yojana

Follow us on

PM Kisan Yojana: కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోకి ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయిచింది. ఈమేరకు ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించిన నిధులు మంగళవారం(జూన్‌ 18న) విడుదల కానున్నాయి. మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

9.26 కోట్ల రైతులకు లబ్ధి..
ఇక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది రైతులు లబ్ధి పొందన్నారు. ఈమేరకు ఈ సీజన్‌లో మొదటి విడతగా రూ.2 వేల చొప్పన కేంద్రం 5 ఎకరాలలోపు సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ చేస్తుంది. ఇందుకు రూ.20 వేల కోట్లు విడుదల కానున్నాయి.

ఏటా మూడు విడతల్లో..
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని కేంద్రం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతీ విడతలో రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో కలిపి రూ.6 వేలు చెల్లిస్తుంది. ప్రస్తుతం 17వ విడత సాయం విడుదల చేస్తుంది.

కేవైసీ అప్‌డేట్‌ అయితేనే జమ..
ఇక పీఎం కిసాన్‌ నిధులు జమ కావడానికి బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి. అప్పుడే డబ్బులు అందుతాయి. కేవైసీ అయిందో లేదో తెలుసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వద్ద పీఎం కిసాన్‌ అధికారి వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

– సైట్‌ ఓపనెన్‌ చేసిన తర్వాత ఫార్మర్‌ కార్నర్‌ సెక్షన్‌లోకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి.
– ఇప్పుడ ఆధార్‌ లేదా రిజిస్టర్డ్‌ బ్యాంకు ఖాతా నంబర్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి. తర్వాత గెట్‌ డేటా పై క్టిక్‌ చేయాలి. దీంతో లబ్ధిదారుడి స్టేటస్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
– ఈకేవైసీ ఫార్మాలిటీ పూర్తి చేయడానికి ఈ పథకం కింద కేంద్రం అందించే ఆర్థి సాయం పొందేందుకు త్వరగా ఈకేవైసీ చేసుకోవాలి. రైతుల తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ఆధారిత ఈకేవైసీని ఎంచుకోవాలి.