బూట్ స్పేస్ ఎక్కువగా ఉండి..రూ.10 లక్షల లోపు ఉన్న కార్లు ఏవో తెలుసా?

7 సీటర్ అయిన ఈ కారు అన్ని సీట్లు 84 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. దీన్ని సీట్లు కిందకు వంచడం ద్వారా దాదాపు 625 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీనిని రూ.7.04 లక్షల నుంచి రూ.10.47 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : June 17, 2024 10:59 am

Car With Boos Space

Follow us on

కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎలాంటి కారుకొనాలని చాలా మంది సందేహంలో ఉంటారు. అయితే వారి అవసరాలు, బడ్జెట్, ఉపయోగాల నేపథ్యాలను బేస్ చేసుకొని అందుకు అనువైన కారు కొనడం బెటర్. చాలా మంది కార్యాలయం అవసరాలకు కారును కొనుగోలు చేస్తారు. మరికొందరు పర్సనల్ గా లాంగ్ జర్నీ చేసేవారు తీసుకుంటారు. అయితే ఫ్యామిలీతో తరుచూ ప్రయాణం చేయాలనుకునేవారు సైతం ఓ వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేసేవారు లగేజీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వారు బూట్ స్పేస్ ఉన్న కార్లు తీసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. బూట్ ఎక్కువగా ఉండి రూ.10 లక్షలలోపు ఉన్న కార్లు మార్కెట్లో ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

రెనాల్ట్ ట్రైబర్:
రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ 1.0 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో 71 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 7 సీటర్ అయిన ఈ కారు అన్ని సీట్లు 84 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. దీన్ని సీట్లు కిందకు వంచడం ద్వారా దాదాపు 625 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీనిని రూ.7.04 లక్షల నుంచి రూ.10.47 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

హోండా అమేజ్:
హోండా కంపెనీకి చెందిన అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 89 బీహెచ్ పీ పవర్, 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తాయి. ఇందులో 420 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీనిని రూ.8.58 లక్షల ప్రారంభం నుంచి రూ.11.96 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

టాటా టిగోర్:
సెడాన్ కార్లలో టాటా కంపెనీకి చెందిన టిరోగ్ అసాధారణమైన బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఇందులో 419 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 85 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పనిచేసే దీనిని రూ.7.47 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

రెనాల్ట్ కిగర్:
రెనాల్ట్ కంపెనీకి చెందిన మరోకారు కిగర్ 405 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 71 బీహెచ్ పీ పవర్ తో పాటు 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీనిని రూ.7.04 లక్షల నుంచి రూ.13.28 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

కియా సోనెట్:
కియా కంపెనీకి చెందిన సొనెట్ 392 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీనిని రూ.9.39 లక్షల నుంచి రూ.19.02 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్ల తో పనిచేస్తుంది. ఇవి వరుసగా 81 బీహెచ్ పీ, 114 బీహెచ్ పీ బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి.