PM Kisan and Annadata Sukhibhav schemes : తాజాగా ప్రభుత్వం రైతులకు మద్దతుగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందబోతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకంలో ప్రతి రైతుకు రూ.2 వేలు తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక రూ.5 వేలు చొప్పున రెండు విడతలలో ఇక చివరిగా మరో రూ.4 వేలు జమ చేయనుంది.
Also Read : పీఎం కిసాన్ స్కీం ప్రత్యేక డ్రైవ్.. మే 31 వరకు మాత్రమే.. రైతులందరూ పేరు నమోదు చేసుకోండి..
ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో మూడు విడతలుగా రూ.20 వేలు ప్రభుత్వం జమ చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఈ నెలలోనే 20వ విడత కింద నిధులను అందిస్తుంది. గత ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ పథకం 19వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పీఎం కిసాన్ పథకం అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు తొలి విడత, అలాగే ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల వరకు రెండవ విడత ఇక డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు మూడవ విడతగా రైతుల ఖాతాలలో చెల్లింపులు జరగనున్నాయి. అయితే పీఎం కిసాన్ పథకం, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే వీళ్ళు కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ముఖ్యంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యి ఉండాలి. రైతుల బ్యాంకు ఖాతా వాళ్ళ ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాలి. రైతులకు సంబంధించిన భూమి పత్రాలు కూడా అప్డేట్ అయ్యి ఉండడం తప్పనిసరి. రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయిన www.pmkisan.gov.in లోకి వెళ్లి తమ ఆధార్ నెంబర్ నమోదు చేసుకున్న తర్వాత వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. మే 31, 2025 వరకు మాత్రమే రైతులకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ.