Ukraine has overthrown all of Russia: బలమైన పాము చీమల వల్ల చనిపోతుంది. మదపుటేనుగు గరికపోచల ముందు తలవంచుతుంది. ఇవి సామెతలు మాత్రమే కాదు.. జీవిత సత్యాలు కూడా. అందువల్లే వీటిని మన పూర్వీకులు పదేపదే ప్రస్తావించేవారు.
ప్రస్తుత కాలంలో పై సామెతలు అనేక సందర్భాల్లో వాస్తవరూపంలోకి వచ్చాయి. అలాంటి వాస్తవం ఇటీవల చోటుచేసుకుంది.. గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్ మీద రణం సాగిస్తున్న విషయం తెలిసిందే. చిన్న దేశం అయినప్పటికీ ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. వాస్తవానికి యుద్దంలో మొదటి నుంచి కూడా రష్యాది కాస్త అప్పర్ హ్యాండ్ అయింది. అయితే ఇటీవల ఒక స్పై ఆపరేషన్ చేపట్టింది. ఉక్రెయిన్ చేపట్టిన స్పై ఆరేషన్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా అగ్ర రాజ్యం, డ్రాగన్, ఇజ్రాయిల్ వంటి దేశాలను నివ్వెర పరుస్తోంది. ఉక్రెయిన్ ఈ స్థాయిలో రహస్య క్రతువు చేపట్టడానికి ఓ ప్రధానమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఆర్టెమ్ టైమో ఫియివ్.. అతడు తన దేశం కోసం ఏకంగా డీజే అవతారం ఎత్తాడు. అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాడు. ఆదేశాలు రాగానే 117 డ్రోన్ లను హవాలా మార్గంలో రష్యాలోకి రప్పించుకున్నాడు..
Read Also: టీటీడీకి కొత్త చీఫ్.. చంద్రబాబు సంచలన నియామకం!
ఒక కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా నలుగురు డ్రైవర్లను మాట్లాడుకున్నాడు. అత్యవసరమైన డెలివరీ ఉందని చెప్పి అక్కడి అధికారులను బురిడీ కొట్టించాడు. ఒకేసారి అన్ని డ్రోన్లను ప్రయోగించాడు. దాదాపు 6000 కిలోమీటర్ల రేడియస్ లో నాలుగు ముఖ్యమైన సైనిక స్థావరాలను పేల్చేశాడు. దీనికి ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని పేరు పెట్టారు. అంటే సాలీడు గూడు కట్టుకున్నట్టుగా.. ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లను అదేవిధంగా అమర్చి రష్యా సైనిక స్థావరాలను పేల్చేశారు. ఇటీవల కాలమే కాదు.. గతంలో ఈ తీరుగా ఏ సైన్యం కూడా ఆపరేషన్ చేపట్టలేదు. ఒక రకంగా మానవ చరిత్రలోనే అతిపెద్ద సీక్రెట్ ఆపరేషన్. బయటికి చెప్పడం లేదు కానీ దీనివల్ల రష్యా ఏకంగా 50 వేల కోట్ల రూపాయలను నష్టపోయింది.. ఒక రకంగా రష్యాను ఇప్పట్లో కోలుకోకుండా చేసింది.
Read Also: రాజేంద్ర ప్రసాద్ తో ఎస్వీ కృష్ణారెడ్డికి గొడవ ఎలా వచ్చిందంటే?
ఉక్రెయిన్ రష్యాను కొట్టిన దెబ్బ.. భవిష్యత్తు కాలంలో యుద్ధ వ్యూహాలను.. పరిణామాలను ఒక విధమైన పాఠంగా చూపించింది. ఏకంగా 30% యుద్ధ విమానాలను రష్యా ఒకేసారి కోల్పోయింది అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ పరిణామం నుంచి ఇండియా చాలా విలువైన పాఠాలు నేర్చుకోవాలి. వాస్తవానికి యుకే ఉక్రెయిన్ ను లక్ష డ్రోన్లను సరఫరా చేసింది. అయితే ఇండియా పై ఉగ్రవాద దేశం చేపట్టే దిక్కుమాలిన పోరుకు డ్రాగన్, తుర్కియో అందించే డ్రోన్లు అతిపెద్ద విపత్తు. ఎందుకంటే మన దగ్గర ఉన్న అత్యంత ఆధునికమైన గగనతల రక్షణ వ్యవస్థ వల్ల వాటిని నిర్వీర్యం చేసాం. ఒకవేళ ఆర్టెమ్ టైమో ఫియివ్ మాదిరిగా దిక్కుమాలిన ఉగ్రవాద దేశం ఎవరినైనా అండర్ కవర్ ఆపరేషన్ లో దింపి.. ఇలాంటి విధ్వంసం సృష్టిస్తే.. అంతటి ఉత్పాతానికి పాల్పడితే.. పరిస్థితి ఏమిటి.. ఇక్కడ ఇండియా మేల్కోవాలి.
మన దేశంలో ఉగ్రవాద దేశ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. అక్కడిదాకా ఎందుకు ఐఎస్ఐకి మనదేశంలో అతిపెద్ద నెట్వర్క్ ఉంది. స్లీపర్ సెల్స్, అండర్ కవర్ ఏజెంట్లు, ఉగ్రవాదుల మద్దతుదారులు, దిక్కుమాలిన రాజకీయ పార్టీలు.. ఇన్ని అవరోధాలను మన దేశం ఎదుర్కోవాలి. ఇప్పటికే నీళ్లు బంద్ పెట్టాం. వ్యాపారాన్ని బంద్ పెట్టాం. అంతర్జాతీయంగా బయటపడుతున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన గడ్డ మీద నుంచి మనకే ఎసరు పెట్టే సన్నాసులను గుర్తించాలి. అవసరమైతే ఏది పారేయాలి.. కానీ ఇక్కడే ఆపరేషన్ సిందూర్ కనుక మరికొద్ది రోజులు అలాగే నడిపించి ఉంటే.. దిక్కుమాలిన దేశం కథ వేరే విధంగా ఉండేది. ఒక రకంగా కాలగర్భంలో కలిసిపోయేది. ఇలా వెనక్కి తగ్గడం వల్ల మోడీ చరిష్మా మాత్రమే కాదు.. ఇండియా సత్తాను కూడా తగ్గించినట్టే అనుకోవాలి.