PM Kisan Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇంతకాలం నుంచి కొత్త రైతులు ఈ పథకం లో తమ పేరును నమోదు చేసుకునేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మే ఒకటవ తేదీ నుండి 31వ తేదీ వరకు రైతుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన కొత్త రైతులు అందరూ కూడా వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఈ రైతులందరికీ జూన్ నెలలో 20వ విడత కింద రూ.6000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఒక్కో రైతుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.6 వేలు అందిస్తుంది. కానీ కొన్ని ఏళ్ల నుంచి ఈ పథకంలో కొత్త రైతులు పేరు నమోదు చేర్చుకునే అవకాశం లేకపోవడంతో ఆ రైతులందరూ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని అందుకోలేకపోయారు.
Also Read : వితకు కేసీఆర్ రాయబారం
రైతులందరూ ఈ సమస్యను గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం జారీ చేసింది. ఈ క్రమంలో కొత్త రైతులందరూ ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి మే 1, 2025 నుండి మే 31 2025 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లో పేరు నమోదు చేసుకొని కొత్త రైతులందరూ కూడా వెంటనే పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. గ్రామస్థాయిలో స్థానిక అధికారులందరూ కూడా ఈ డ్రైవ్ సమర్థవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులను ధ్రువీకరించడంతోపాటు ఇప్పటివరకు ఈ పథకంలో పేరు నమోదు చేసుకొని అర్హత ఉన్న రైతుల్ని కూడా చేర్చుకోవాలనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ పథకంలో అర్హత ఉండి ఇప్పటివరకు పేరు నమోదు చేసుకొని రైతులందరూ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. వచ్చేనెల జూన్లో ఈ పథకం కింద 20వ విడత సాయం రైతులకు విడుదల కానుంది. ఈ పథకంలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న రైతులకు కూడా ఈ సాయం అందుతుంది.