గ్రేటర్ ఎన్నికలపై ప్రధాని ఆరా.. బీజేపీలో ఉత్సాహం..!

తెలంగాణలో బీజేపీ పార్టీ అనుకున్న దానికంటే బాగా పుంజుకుంటోంది. 2023ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్రణాళికలతో ముందుకెళుతోంది. తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుపోతున్న కారు స్పీడుకు బీజేపీ దుబ్బాకలో సడెన్ బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ పార్టీదే విజయం అనే ధీమాను బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికతో పటాపంచలు చేసిన సంగతి తెల్సిందే..! Also Read: కరోనా టీకా కొందరికేనా..? దుబ్బాక ఫలితం గ్రేటర్ ఎన్నికల్లో పడొద్దనే భావనతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలను […]

Written By: Neelambaram, Updated On : December 2, 2020 6:27 pm
Follow us on

తెలంగాణలో బీజేపీ పార్టీ అనుకున్న దానికంటే బాగా పుంజుకుంటోంది. 2023ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్రణాళికలతో ముందుకెళుతోంది. తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుపోతున్న కారు స్పీడుకు బీజేపీ దుబ్బాకలో సడెన్ బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ పార్టీదే విజయం అనే ధీమాను బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికతో పటాపంచలు చేసిన సంగతి తెల్సిందే..!

Also Read: కరోనా టీకా కొందరికేనా..?

దుబ్బాక ఫలితం గ్రేటర్ ఎన్నికల్లో పడొద్దనే భావనతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలను కరోనా టైంలోనూ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు ధీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ప్రచారం సాగింది.

డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నిక పోలింగ్ జరిగింది. మొత్తం 150 డివిజన్లకు గాను నిన్న 149స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒక్క ఓల్డ్ మలక్ పేట డివిజన్లో సీపీఎం.. సీపీఐ గుర్తులు తారుమారుకావడంతో అక్కడ నేడు ఎన్నిక జరుగుతోంది. డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఫలితాలు రానున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రధాని మోదీ గ్రేటర్ ఎన్నికల జరిగిన తీరుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Also Read: ఎర్రజెండా నర్సింహయ్యనే..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని అభినందించారు. గ్రేటర్లో పార్టీని విజయ పథంలోకి తీసుకెళ్లేందుకు కష్టపడిన శ్రేణులపై ప్రశంసలు కురిపించారు. అలాగే పార్టీ నాయకులు.. కార్యకర్తలపై జరిగిన దౌర్జనాలను గురించి అడిగి తెలుసుకున్నారట. సుమారు 10నిమిషాలు పాటు మోదీ బండి సంజయ్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది.

గ్రేటర్లోని పోలింగ్ శాతం గురించి మోదీ ఆరా తీసినట్లు సమాచారం. బీజేపీ శ్రేణులు ఇలాగే ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారట. బీజేపీ అధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు అన్నివిధలా సహకారం ఉంటుందని బండి సంజయ్ కి ప్రధాని హామీ ఇచ్చారని సమాచారం. ఇక ప్రధాని మోదీ బండి సంజయ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని సమాచారం శ్రేణులకు తెలియడంతో వారంతా ఖుషీ అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్