జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం క్రుష్ణ జిల్లాలో పర్యటించారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని కలిశారు. అలగే దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. తెలంగాణలోని హైదరాబాద్ లో వరదల కారణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 10 వేలు ఇచ్చిందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదని, వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని పవన్ అన్నారు. వైసీపీ పాలనలో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. రైతులకు పరిహారం ఇప్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.