https://oktelugu.com/

వాస్తవాలు చెప్పండి.. వదంతులు ఆపండి

కారోన భయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నియమాలను మరింత కట్టు-దిట్టం చేశాయి. అదేవిధంగా అటు మీడియాకి ఇటు వైద్యులకు పలు సూచనలు, సలహాలను జారీ చేశాయి. ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేస్తూ..లాక్‌ డౌన్‌ ను సీరియస్‌ గా తీసుకోండి. దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించుకోండి. ఆదేశాలను కచ్చితంగా పాటించండి. నియమ నిబంధనలను ఆచరణలో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని కోరుతున్నాను” అని మోడీ తెలిపారు. అదేవిధంగా ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ..”వాస్తవాలను […]

Written By: , Updated On : March 24, 2020 / 10:02 AM IST
Follow us on

కారోన భయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నియమాలను మరింత కట్టు-దిట్టం చేశాయి. అదేవిధంగా అటు మీడియాకి ఇటు వైద్యులకు పలు సూచనలు, సలహాలను జారీ చేశాయి. ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేస్తూ..లాక్‌ డౌన్‌ ను సీరియస్‌ గా తీసుకోండి. దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించుకోండి. ఆదేశాలను కచ్చితంగా పాటించండి. నియమ నిబంధనలను ఆచరణలో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని కోరుతున్నాను” అని మోడీ తెలిపారు.

అదేవిధంగా ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ..”వాస్తవాలను ప్రజలకు చెప్పండి, అసత్య, అవాస్తవ వార్తలను ప్రకటించడం మంచిది కాదని, ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించాలి. అదే సమయంలో వారిలో నిరాశావాదం, భయాందోళనలు పెరిగిపోని రీతిలో సకారాత్మక అంశాలు అందించాలి. ఈ యుద్ధంలో ముందుండి పోరాడుతున్నది డాక్టర్లు, వైద్య సిబ్బందే. వారిలో ఉత్సాహాన్ని నింపేలా ప్రోత్సహించాలి. క్షేత్రస్థాయి అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో వార్తా ఛానళ్లది కీలక భూమిక. అందుకే ప్రభుత్వం నిరంతరం ఈ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయి పాత్రికేయులకు ప్రత్యేక మైకులు ఇవ్వడంతో పాటు, వారు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీసం మీటరు దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోండి. శాస్త్రీయ విషయాలను వ్యాప్తి చేయండి. చర్చల్లో విషయ పరిజ్ఞానం ఉన్నవారు పాల్గొనేలా చూడండి. అసత్యాల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు నిరోధించండి. ప్రస్తుతం నెలకొన్న వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి సామాజిక దూరం పాటించడమే అతిముఖ్యం అన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి” అని మోడీ తెలిపారు