సందట్లో సడెమియా.. అటకెక్కిన సిఏఏ నిరసనలు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు, భయానక పరిస్థితుల మధ్య పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నిరసనలు ఆటకెక్కాయి. ఇప్పటి వరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి కారోన వైరస్ వల్ల ప్రజలలో నెలకొన్న భయానక పరిస్థితులు అందవేసిన చేయిగా భావిస్తున్నాయి. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా.. కఠిన చర్యలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 11:24 am
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు, భయానక పరిస్థితుల మధ్య పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నిరసనలు ఆటకెక్కాయి. ఇప్పటి వరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి కారోన వైరస్ వల్ల ప్రజలలో నెలకొన్న భయానక పరిస్థితులు అందవేసిన చేయిగా భావిస్తున్నాయి.

దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా.. కఠిన చర్యలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో షాహిన్ బాగ్ ఏరియాలో ఆందోళన చేస్తున్న  ఉద్యమకారులను బలవంతంగా పోలీసులు తొలగించారు. పోలీసు అధికారుల బృందం మంగళవారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని నిరసనకారులను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. టెంట్లు, ఇతర సామగ్రిని నిరసన స్థలం నుండి తొలగిస్తున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని, నిరసనకారులు ఒకరికొకరు మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలని  ఆదేశించారు. అలాగే  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం మైక్రోఫోన్ వాడకూడదని  కూడా హెచ్చరించారు.

అలాగే మరోవైపు నిరసనకారులను వెంటనే తొలగించాలని కోరుతూ చేసిన పిటిషన్ విచారణను  కరోనా వైరస్ కారణంగా  సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

2019 డిసెంబర్ 15న ప్రారంభమై గత 101 రోజులుగా కొనసాగుతున్న సీఏఏ నిరసనలు నేటితో తెరపడినట్లయింది. పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా కారోన బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరగా అందులో 16వేల చనిపోయారు. దేశంలో 499 కారోన పాజిటివ్ కేసులు నమోదుకాగా వారిలో తొమ్మిదిమంది మరణించారు.