https://oktelugu.com/

కరోనాకు గబ్బిలాలే దారి చూపిస్తున్నాయా?

కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. ఈ వైరస్ ధాటికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి అగ్రదేశాలు సైతం విలవిలలాడిపోయాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్యలో పెరిగిపోతోంది. సెలబ్రెటీలు సైతం కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీంతో చాలాదేశాలు లాక్డౌన్ విధించి కరోనా కట్టడికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా? కరోనా వైరస్ పుట్టుకను పరిశీలిస్తే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2020 / 08:32 PM IST
    Follow us on


    కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. ఈ వైరస్ ధాటికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి అగ్రదేశాలు సైతం విలవిలలాడిపోయాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్యలో పెరిగిపోతోంది. సెలబ్రెటీలు సైతం కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీంతో చాలాదేశాలు లాక్డౌన్ విధించి కరోనా కట్టడికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

    కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

    కరోనా వైరస్ పుట్టుకను పరిశీలిస్తే అది గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందని నిపుణులు చెబుతున్నారు. కరోనాతోపాటు చాలా వైరస్ లకు గబ్బిలాలు ఆవాసాలుగా మారుతుండటంతో గబ్బిలాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గబ్బిలాలపై ప్రభావం చూపని వైరస్ లు మనుషుల ఎలా ప్రభావం చూపుతున్నాయనే కోణంలో అమెరికన్ సైంటిస్టులు అధ్యాయనం చేపట్టారు. వీరి అధ్యాయనంలో చాలా విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇందులోని విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు.

    కరోనా వైరస్ ప్రభావం గబ్బిలాల్లోని రోగ నిరోధక వ్యవస్థపై పరిమిత స్థాయిలోనే ఉంటుందని తేలిందట. గబ్బిల్లాల్లో వైరస్ విజృంభించకుండా ఉండేందుకు వాటిలో ప్రత్యేక వ్యవస్థ క్రియాశీలకంగా పని చేస్తుందని గుర్తించారు. అదే సమయంలో మనుషుల్లో మాత్రం ఈ వైరస్ సోకిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందిచటంతో విజృంభిస్తుందని తమ పరిశోధనల్లో వెల్లడిందని సైంటిస్టులు చెబుతున్నారు.

    కరోనా తెచ్చిన బద్ధకం!

    ఈ కారణంగానే మానవుడిలో జ్వరం, దగ్గు, జలుబు, వాపులు వంటి ఇతర లక్షణాలు బయటపడుతున్నాయని అంటున్నారు. రోగనిరోధక శక్తి స్పందించి తిప్పికొట్టే క్రమంలో బయటపడుతున్న పలు వ్యాధులకు కారణమవుతున్న జన్యువులు గబ్బిలాల్లో లేవని వారంటున్నారు. అంతేకాకుండా గబ్బిల్లాల్లోని ఎగిరే గుణం కూడా వాటిలో వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. మనుషుల్లోని ఈ జన్యువుల స్పందనల్ని నియంత్రించే మందులను ఉత్పత్తిచేస్తే కరోనా కంట్రోల్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిశోధన ఆధారంగానే వ్యాక్సిన్ తయారు చేయనున్నట్లు అమెరికన్ సైంటిస్టులు చెబుతున్నారు.