New Parliament Building : నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న కొత్త పార్లమెంట్ భవనాన్ని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా సందర్శించారు. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ , కమిటీ గదులు ఉన్నాయి.
ప్రధాని గంటకు పైగా కొత్త పార్లమెంట్ స్థలంలో గడిపి వివిధ పనులను స్వయంగా పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు.
గతేడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావించిన నూతన భవనాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి భవన నిర్మాణ కార్మికులతో సంభాషించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పెద్ద హాళ్ల మధ్య నిలబడి, ఆ ప్రదేశంలోని ప్రతీదాన్ని అడిగి తెలుసుకున్నారు.
కొత్త పార్లమెంట్ భవనంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించేలా అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఒక గొప్ప రాజ్యాంగ మందిరం, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, ఒక లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన శాలలు, విస్తారమైన పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేశారు..
కొత్త పార్లమెంట్ లో కొత్త ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), క్యాబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్ , నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌లను కూడా కలిగి ఉండడం విశేషం.
కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ప్రస్తుతం పూర్తి కావచ్చింది. త్వరలోనే దీన్ని మోడీ ప్రారంభించనున్నారు.
నూతన పార్లమెంటు భవనం పనులు పరిశీలించిన ప్రధాని శ్రీ @narendramodi pic.twitter.com/RUYCVdSV7K
— మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar) (@BJPMadhukarAP) March 30, 2023