https://oktelugu.com/

Phone pe : మీరు రోజువాడే Phone pe ఎలా మారిందో చూశారా..

Phone pe : పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలామంది డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గు చూపించారు. కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పేటీఎం, ఫోన్ పే సంస్థలు ఆ కాలంలో విపరీతంగా లభ పడ్డాయి.

Written By: , Updated On : March 13, 2025 / 08:06 AM IST
Phone pe

Phone pe

Follow us on

Phone pe : డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఫోన్ పే వాడకం పెరిగిపోయింది. ఇది సమయంలో పేటీఎం సరైన యూజర్ ఫ్రెండ్లీ మార్గాలను అనుసరించకపోవడంతో.. దానిని వాడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇక ఫోన్ పే వాడటం అత్యంత సులభంగా ఉండడంతో చాలామంది దానిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు దేశంలో అత్యధిక యూసర్లు కలిగిన యూపీఐ యాప్ ఫోన్ పే అంటే అతిశయోక్తి కాదు. ఫోన్ పే ద్వారా ప్రతిరోజు వందల కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. డిజిటల్ చెల్లింపులు కావడంతో మోసానికి తక్కువగా ఆస్కారం ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో.. ఫోన్ పే ద్వారానే ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్నాయి. పోటీగా గూగుల్ పే, అమెజాన్ పే వంటి సంస్థలు ఉన్నప్పటికీ.. అవి ఫోన్ పే ను రీచ్ కాలేకపోతున్నాయి.

Also Read : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ లో వచ్చిన ఓచర్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు?

పూర్తిగా మారిపోయింది

ఇక దేశంలో అత్యధికంగా యూజర్లను కలిగి ఉన్న యూపీఐ యాప్ ఫోన్ పే ఇప్పుడు అప్డేట్ అయింది. ఇప్పటివరకు ఇది యూజర్ ఫ్రెండ్లీ గానే ఉంది. ఇప్పుడు దీనిలో అనేక రకాల మార్పులు జరిగాయి. దీంతో యూజర్లు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ఆన్లైన్లో పేమెంట్ స్కాన్ చేయడం ఎలా.. అందులో ఏ ఆప్షన్ కూడా అర్థం కావడం లేదని యూజర్లు వాపోతున్నారు. ఇప్పటిదాకా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న ఈ యాప్ ను ఒకసారి గా ఇలా ఎందుకు మార్చారని యూజర్లు వాపోతున్నారు. ఇక సీనియర్ సిటిజెన్ అయితే ఇది ఫోన్ పే యాప్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు..” ఫోన్ పే యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది. సులభంగా వాడేందుకు అవకాశం ఉండేది. దీనిని ఇప్పుడు పూర్తిగా మార్చేశారు. ఇలా ఎందుకు మార్చారో అర్థం కావడం లేదు. ఒక్క ఆప్షన్ కూడా అర్థం కావడం లేదు. మిగతా యూపీఐ యాప్స్ ఇబ్బందిగా ఉండటం వల్లే ఫోన్ పే వైపు వచ్చాము. ఇది కూడా అలానే ఉంటే ఇక లావాదేవీలు ఎలా జరపాలి.. డబ్బు ఎలా పంపాలి? ఏదైనా అవసరం ఉంటే ఏం చేయాలి? ఇదేదో మాకు ఇబ్బంది కలిగించడానికే రూపొందించారని.. ఇలా అయితే ఫోన్ పే ఉపయోగించడం మానివేస్తామని” యూజర్లు వాపోతున్నారు. మరోవైపు కొత్తగా చేసిన మార్పులపై ఫోన్ పే యాజమాన్యం కూడా స్పందించింది. సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో.. మరింత రక్షణ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. యూజర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభూతిని.. సైబర్ నేరస్థులకు దొరకని సెక్యూరిటీని ఇవ్వడం కోసమే తాము ఇలాంటి అప్డేట్స్ తీసుకొచ్చామని ఫోన్ పే పేర్కొంది. గతంలో కంటే ఇంకా మరింత సులభమైన తీరుగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అప్డేట్స్ తీసుకొచ్చామని.. ఇందులో కఠినమైనవి ఏవీ లేవని ఫోన్ పే ప్రకటించింది.

Also Read : ఫోన్ పే వాడే వారికి శుభవార్త.. రెండు కొత్త సర్వీసులు అందుబాటులోకి?