Google Pay And PhonePe: ఒకప్పుడు ఎక్కడికి వెళ్లినా కూడా డబ్బులు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ మనీ ఎక్కువ. లిక్విడ్ క్యాష్ తక్కువ అయింది. చిన్న చిన్న అవసరాలకు కూడా డిజిటల్ రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు ప్రజలు. ఇక కొన్నింటికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు పెట్టడంతో మరింత ఎక్కువ ఈ అలవాటు పెరిగిపోయింది. అయితే గూగుల్ పే, ఫోన్ పే, వంటివి చేస్తే క్యాష్ బ్యాక్ తో పాటు చాలా సార్లు వోచర్స్ కూడా వస్తుంటాయి. మరి వీటిని కూడా మీరు అమ్మవచ్చు అంటే నమ్ముతారా? అవును దీనికి ఒక మార్గం ఉంది అదేంటంటే..
ఫోన్ లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత cansell అని టైప్ చేయండి. వెంటనే మీకు ఒక వెబ్ సైట్ వస్తుంది. ఆ తర్వాత మీకు కింద సేల్ గిఫ్ట్ కార్డ్స్ అని వస్తుంది. మీ దగ్గర ఏ బ్రాండ్ కు సంబంధించిన ఓచర్ ఉందో ఆ బ్రాండ్ పేరును సెలక్ట్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఎవరికి అయినా ఈ ఓచర్ కొనుగోలు చేయాలి అనుకుంటే మీ ఓచర్ ను కొనుగోలు చేస్తారు. దానికి సంబంధించిన డబ్బును మీకు సెండ్ చేస్తారు.
ఓచర్స్ వచ్చిన వెంటనే కార్డును క్లియర్ చేయగానే చాలా సార్లు బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అంటూ వచ్చేది. కానీ ప్రస్తుతం చాలా బ్రాండ్స్ లకు సంబంధించిన ఆఫర్లు వస్తున్నాయి. మీరు ఆ బ్రాండ్ కు సంబంధించి ఏదైనా ప్రాడక్ట్ ను కొనుగోలు చేస్తే మీకు ధర తక్కువ అవుతుంది. ఇలాంటివి చాలా ఓచర్లు వస్తుంటాయి కానీ వీటిని ఉపయోగిలేరు చాలా మంది.
ఓచర్లు వచ్చాయని వస్తువులు కొనుగోలు చేస్తుంటే అకౌంట్లో డబ్బులు కూడా సరిపోవు. అందుకే వీటిని అలాగే వదిలేయకుండా cansell అనే వెబ్ సైట్ లో మీ ఓచర్లను అమ్మకం చేయండి. దీని ద్వారా డబ్బులు సంపాదించండి. ఏ పని చేసే ముందు అయినా సరే మంచి చెడు ఆలోచించాలి అంటారు కాస్త జాగ్రత్తగా అమ్మకం చేయండి.